Tuesday, 3 November 2026

జమ్మలమడుగు మండలంలో ఉద్రిక్తత

కడప: జిల్లాలోని జమ్మల మడుగు మండలం కన్నెలూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాడాగా టిడిపి, వైసీపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. ఓటు వేసేందుకు డబ్బులు తీసుకోలేదని  టిడిపి తమపై దాడి చేసిందని వైసీపీ కార్యకర్తలపై ఆరోపిస్తున్నారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *