
తెలంగాణకు 163 ఐఏఎస్, 112 ఐపీఎస్ పోస్టులు
ప్రస్తుత డీజీపీ కార్యాలయం తెలంగాణాకే
న్యూఢిల్లీ/హైదరాబాద్, మే 8 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు పంపకాల ప్రక్రియను వేగ వంతం చేశారు. ఇప్పటికే శాసనసభ, మండలి, సెక్రటేరియట్ పంపకాలు పూర్తి చేసిన ప్రభుత్వం తాజాగా ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల పం పకాలను ప్రారంభించింది. గురువారం ఢిల్లీలో ఆలిండియా సర్వీసెస్ అధికా రులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పంపిణీ కోసం నియమించిన ప్ర త్యూస్‌సిన్హా, కమల్‌నాథన్ కమిటీలు సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి పాల్గొన్నారు. కీలకమై ఐఏఎ స్, ఐపీఎస్ అధికారులకు ఆప్షన్స్ ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది. అ లాగే ఉద్యోగుల పంపకాలపై అభ్యంతరాలను కమిటీ పరిశీలించింది. ఉద్యో గుల కేటాయింపుపై మార్గదర్శకాలను దాదాపు ఖరారు చేసింది. స్థానికత ఆ ధారంగానే ఉద్యోగుల కేటాయింపు అధికారం కొత్త ప్రభుత్వాలకు ఇవ్వా లని కమల్‌నాథన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వానికి ఈమే రకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిబ్బంది,
వసతుల ఖరారుపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు నివేదిక అందించారు. కేంద్ర ప్రభుత్వం ఈ నివేదికను ఆమోదిస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నోటిఫై చేస్తుంది. మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల పంపకాన్ని కేంద్రం పూర్తి చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 163 మంది ఐఏఎస్, 112 మంది ఐపీఎస్, 65 ఐఎఫ్‌ఎస్ అధికారులను కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌కు 211 ఐఏఎస్, 144 ఐపీఎస్, 82 ఐఎఫ్‌ఎస్ పోస్టులు కేటాయించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 284 మంది ఐఏఎస్, 209 ఐపీఎస్ 136 మంది ఐఎఫ్‌ఎస్ అధికారులు పనిచేస్తుండగా మరో 114 ఐఏఎస్, 78 ఐపీఎస్, 46 ఐఎఫ్‌ఎస్ పోస్టులను నేరుగా భర్తీ చేస్తారు. అలాగే పోలీసు శాఖలోనూ భవనాల కేటాయింపును దాదాపు పూర్తి చేశారు. కీలక విభాగాలు, శాఖలుకు భవనాలను కేటాయించారు. ప్రస్తుత డీజీపీ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర డీజీపీకి, ప్రస్తుత సీఐడీ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ డీజీపీకి కేటాయించారు. తెలంగాణ డీజీపీ కార్యాలయంలోనే ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగానికి సంబంధించిన కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుత ఇంటెలిజెన్స్ భవనాన్ని తెలంగాణకు కేటాయించారు. పక్కన కొత్తగా నిర్మిస్తున్న భవనం ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ శాఖకు కేటాయించారు. స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డులను రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా ఏర్పాటు చేశారు. రెండు బోర్డులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నియమిస్తాయి. ఆయా రాష్ట్రాల బోర్డులకే రిక్రూట్‌మెంట్ నిర్ణయాధికారం ఉంటుంది. ఎన్నికల ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడే లోగా విభజన ప్రక్రియ పూర్తి చేసే క్రమంలో సచివాలయంలో కార్యాలయాల విభజన పక్రియకు సంబంధించిన సివిల్ పనులు వేగిరం చేశారు. వీటిని పూర్తిచేయడానికి మరో రెండు వారాలు మాత్రమే గడువు మిగలడంతో అధికారులు తమ పనులను వేగవంతం చేశారు. ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంగా హెచ్ బ్లాక్‌ను తీర్చిదిద్దడానికి పనులు ప్రారంభించారు. ఇప్పటికే ఇక్కడ ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం మినహా మిగిలిన కార్యాలయాలన్నింటిని ఖాళీచేయించారు. మొదటి, రెండో అంతస్థులలో పనులు ప్రారంభించేందుకు గురువారం అధికారుల బృందం ఈ భవనాలను పరిశీలించింది. రాష్ట్ర విభజన పక్రియను కేంద్రం మరింత వేగవంతం చేసింది. మరోవైపు గురువారం ఉదయం కేంద్ర ¬ంశాఖ అధికారులతో ఐఏఎస్, ఐపీఎస్, ఐపీఎస్ అధికారులు విభజనపై నియమించబడిన ప్రత్యూష్‌సిన్హా కమిటీ సమావేశమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె మహంతి ఈ సమావేశానికి హాజరయ్యారు. విభజన తర్వాత ఉద్యోగుల పంపకాలతో పాటు, ఇతర కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది
శరవేగంతో పంపకాలు




