
గుజరాత్ మోడల్ ఓ చాక్లెట్
రూపాయికి గజం అదానీకి, కార్పొరేట్లకే అక్కడ పెద్దపీట : రాహుల్
కోల్‌కతా, మే 8 (జనంసాక్షి) :
ఎన్‌డీఏ అధికారంలో ఉన్నప్పుడే దేశంలో ఉగ్రవాద దా డులు ఎక్కువగా జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. గురువారం పశ్చిమబెంగాల్ లోని ఘటాల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. దేశంలో శాంతిభద్రతలను అదు పులోకి తీసుకువస్తామంటున్న బీజేపీ, ఎన్‌డీఏ నేతలు తమ ప్రభుత్వకాలంలో జరిగిన ఉగ్రదాడులపై ఏం సమా ధానం చెప్తారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ చెప్తోన్న గుజరాత్ అభివృద్ధి నమూ నా చాక్లెట్‌లాంటిదని, అది కొద్ది మంది సంపన్నులకే పరి మితమైందని అన్నారు. అలాంటి దాన్ని భూతద్దం చూ పేందుకు మోడీ ప్రయత్నిస్తున్నాడని అన్నారు. గుజరా త్‌లో అభివృద్ధి చెందింది మోడీకి సన్నిహితంగా ఉన్న కా ర్పొరేట్లు, పెట్టుబడిదారులేనని ఆయన చెప్పారు. గుజరా త్‌లోని అత్యంత విలువైన భూములను రూపాయికి గజం చొప్పున అదానికి కట్టబెట్టి అక్కడి పేదల పొట్టకొట్టారని ఆరోపించారు. కార్పొరేట్లకు ప్రజల సంపదను దోచిపెట్టిన గొప్ప వ్యక్తి మోడీ అని ఇప్పుడు అలాంటి నమూనానే దేశవ్యాప్తంగా ప్రయోగించాలని చూస్తున్నాడని మండిపడ్డారు. గుజరాత్‌లో పేదలు ఆకలితో అలమటించిపో తున్నా రని, వారికి కనీసం శుభ్రమైన తాగునీరు కూడా లేదని రాహుల్‌గాంధీ అన్నారు. మోడీకి అధికారం ఇస్తే సమగ్ర ప్రభుత్వం, స్థిరమైన ప్రభుత్వం ఏర్పడదని, దేశంలో అస్థిరత, అశాంతి రాజ్యమేలుతాయని హెచ్చరించారు. లౌకిక దేశమైన భారత్‌ను మతం ప్రాతిపదికనగా నిలువునా చీల్చేందుకు ప్రయత్ని స్తున్న మోడీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో మోడీ హవా పేరుతో సాగుతున్న ప్రచారం ఎన్నికల దగ్గరపడుతున్న కొద్ది ఉత్తదేనని తేలుతుందని ఆయన అన్నారు. మోడీ హవా ఒక వర్గం మీడియా సృష్టిమాత్రమేనని, అందులో ఏమాత్రం క్షేత్రస్థాయిలో కనిపించలేదని ఆయన అన్నారు. గత ఎన్నికల సమయంలోనూ ఎన్‌డీఏ తరపున ఒకవర్గం మీడియా ఇలాంటి బూటకపు ప్రచారాన్ని చేసిందని అన్నారు. ప్రజలు అప్రమత్తతో ఓటేయాలని, దేశ సమగ్రతను కాపాడే లౌకికవాద శక్తులకు అండగా నిలువాలని పిలుపునిచ్చారు.
ఎన్‌డీఏ పాలనలోనే ఎక్కువగా ఉగ్రదాడులు




