Tuesday, 3 November 2026

ఆర్బీఐ గవర్నర్‌ను కొనసాగించాల్సిందే : చిదంబరం

న్యూఢిల్లీ, మే 8 (జనంసాక్షి) :
ఆర్‌బీఐ గవర్నర్‌గా ప్రస్తుతం ఉన్న రఘురామ్‌ రాజ న్‌ను తదుపరి ప్రభుత్వం కొనసాగించాలని కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం అన్నారు. గవర్నర్‌గా రఘు రామ్‌ రాజన్‌ నియామకాన్ని తదుపరి ప్రభుత్వం తప్ప కుండా గౌరవించాలని చిదంబరం సూచించారు. ఆయన సమర్థుడైన అధికారి అని అన్నారు. ఇదిలా వుంటే ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉందని అన్నారు. అధిక వృద్ధితోనే పెట్టుబడుల వస్తాయన్నారు. ఆహార వస్తువుల ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం పెరు గుతోందన్నారు. ఇదిలావుంటే ఆర్బీఐ తదుపరి విధా న రేట్ల సవిూక్షలో ద్రవ్యోల్బణం, అభివృద్ధి అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందన్న ఆశాభావాన్ని ఆయ న వ్యక్తం చేశారు. భారతీయ మహిళా బ్యాంకుకు (బీఎమ్‌బీ) నిధుల సాయానికి
భరోసా ఇస్తూ.. ఈ బ్యాంకు అందరీకి బ్యాంకింగ్‌ సేవల విషయంలో కీలక పాత్ర పోషించనుందని.. మహిళల స్థితిగతులను మెరుగుపర్చనుంద చిదంబరం అన్నారు. బీఎంబి మరింత మూలధనం కోరు కొనే పక్షంలో అందుకు తాను హావిూ ఇవ్వగలనని చిదంబరం అన్నారు. ఈ సందర్భంగా మీ తరువాత ఎవరు ఆర్థిక మంత్రి అవుతారని విలేకరులు ప్రశ్నించగా, నా తరువాత ఈ స్థానంలోకి వచ్చేది నేనే కావచ్చు అంటూ చిదంబరం సరదా ధోరణిలో జవాబిచ్చారు. ఇప్పటివరకు భారతీయ మహిళా బ్యాంకు పనితీరు సంతృప్తికరంగా ఉందని మంత్రి చెప్పారు. అందరికీ చేరువయ్యేందుకు సాంకేతి కతను ఉపయోగించుకోవాలని బ్యాంకుకు సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 57 కొత్త శాఖలను ప్రారంభించే యోచనలో బీఎంబీ ఉందని తెలిపారు. ‘ఈ లక్ష్యాన్ని వారు అందుకుంటారన్న విషయంలో నాకు ఎటువంటి అనుమానం లేదు. జమ్మూ, శ్రీనగర్‌లలో స్థలాలు చూశారు. అక్కడ కొత్త శాఖలు తెరుస్తార’ని చిదంబరం అన్నారు. చదువుకునే బాలికల కోసం తగ్గింపు వడ్డీ రేటుకే బ్యాంకు రుణాలందిస్తోందని తెలిపారు. రోజు వయసు నుంచి 13 ఏళ్ల బాలికల కోసం ఆవృత డిపాజిట్‌ (ఆర్‌డీ) పథకాన్ని బ్యాంకు ప్రారంభించింది. 2013 నవంబరులో ప్రారంభమైన బీఎంబీకి ప్రభుత్వం తొలి మూలధన సాయం కింద రూ.1,000 కోట్లను ఇచ్చింది. ఇదిలావుంటే అమెరికన్‌ కరెన్సీ ఎగు మతిదారులు అమ్మకాలకు పాల్పడటంతో అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌ లో రూపాయి ఒకనెల గరి ష్టాన్ని నమోదు చేసుకుంది. 60 రూపాయలకు దిగువన ట్రేడ్‌ కావడం గత నెల రోజుల్లో ఏప్రిల్‌ 9 తర్వాత ఇదే తొలిసారి. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెన్‌ ఎక్స్చెంజ్‌ మార్కెట్‌ లో డాలర్‌ కు వ్యతిరేకంగా రూపా యి 59.94 వద్ద ట్రేడ్‌ అవుతోంది. బుధవారం రూపాయి 60.13 వద్ద ముగిసింది. గురువారం ఇంట్రా డే ట్రేడింగ్‌ లో రూపాయి 59.94 గరిష్టాన్ని, 60.05 కనిష్టాన్ని నమోదు చేసుకుంది. గురు వారం మధ్యాహ్నం 1.45 సమయానికి 60.02 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *