Tuesday, 3 November 2026

రూపే రాక ఓ ముందడుగు


జాతికి అంకితం చేసిన రాష్ట్రపతి ప్రణబ్‌
న్యూఢిల్లీ, మే 8 (జనంసాక్షి) :
రూపే రాక భారత ఆర్థికరంగంలో ఓ ముందడుగు అని రాష్ట్రపతి ప్రణబ్‌ ము ఖర్జీ అన్నారు. వీసా, మాస్టర్‌ కార్డుల తరహాలోనే రూపే కార్డు చెల్లింపుల కో సం ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు. రూపే కార్డును గురు వారం ఆయన జాతికి అంకితమిచ్చారు. రూపే కార్డు ద్వారా చెల్లింపుల వ్యవ స్థను నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) అభివృద్ధి చేసింది. రిజర్వుబ్యాంకు అనుబంధ సంస్థగా, లాభాపేక్ష లేకుండా ఎన్‌పీసీఐ పనిచేస్తుంది. రూపే కార్డు సేవలను అన్ని ఏటీఎంలలో ఉపయోగించుకో వ చ్చు. రిటైల్‌ మార్కెట్లు, ఆన్‌లైన్‌ చెల్లింపులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉం టుంది. ఈ సందర్భంగా ప్రణబ్‌ముఖర్జీ మాట్లాడుతూ, రూపేను జాతికి అంకితం చేయడం ద్వారా చెల్లింపుల విధానంలో దేశం మరో అడుగు ముందుకేసిందని అన్నారు. ఇలాంటి ప్రత్యేక వ్యవస్థ కలిగిన కొన్ని దేశాల సరసన భారత్‌ కూడా చేరిందని తెలిపారు. కార్డుల ద్వారా జరిగే చెల్లింపుల వల్ల భారత్‌ ఆయా రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *