Tuesday, 3 November 2026

మోడీతో చర్చకు సై

ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ కేజ్రీవాల్‌

వారణాసి, మే 8 (జనంసాక్షి) :బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీతో చర్చకు తాను సిద ్ధమని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. వారణాసి ప్రజల సమక్షంలో చర్చ కు రావాలంటూ మోడీకి కేజ్రీవాల్‌ సవాల్‌ విసిరారు. బీజేపీ అభ్యర్థిగా మోడీ వారణాసి నుంచి పోటీ చేస్తుండగా, ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ ఆయనను ఢీకొంటున్నాడు. కొన్ని వారాలుగా వారణా సిలోనే మకాం వేసిన కేజ్రీవాల్‌ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల తేదీ సమీపిస్తుండ టంతో మోడీ ప్రజల సమక్షంలో చర్చకు రావాలంటూ కోరారు. ఇద్దరిని వారణాసి ప్రజలే ప్రశ్ని స్తారని వారికి సమాధానం చెప్పాలని అన్నారు. చర్చ ఎప్పుడు, ఎక్కడ అనే
అంశాలను మోడీకే వదిలేస్తున్నానని అన్నారు. ఈమేరకు ఆయన గురువారం ట్విట్టర్‌లో సందేశం పంపారు. వారణాసిలో మోడీ ఓటమి ఖాయమని పేర్కొన్నారు. ఓటమి నుంచి మోడీని ఎలా కాపాడుకోవాలో బీజేపీ అగ్రనేతలు ఆలోచించుకోవాలని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *