Tuesday, 3 November 2026

ఏపీ మాజీ సీఎం నేదురుమల్లి ఇక లేరు


హైదరాబాద్‌, మే 9 (జనంసాక్షి) :ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్య మంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కన్నుమూశారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో మృతి చెందారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. కొంతకాలం గా కాలేయ సంబంధిత వ్యాధి (పార్కిన్‌సన్‌)తో బాధ పడుతున్నారు. నేదురుమల్లి భౌతికకాయాన్ని సోమాజిగూడలోని ఆయన నివాసానికి తరలించారు. పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పిం చారు. ప్రజల సందర్శనార్థం సాయంత్రం ఇందిరాభవన్‌కు తరలిం చనున్నారు. శనివారం ఆయన స్వస్థలమైన నెల్లూరు జిల్లా వాకా డులో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలి పారు. జనార్దన్‌రెడ్డికి భార్య రాజ్యలక్ష్మి (మాజీ మంత్రి)తో పాటు కు మారులు రామ్‌కుమార్‌రెడ్డి, అశోక్‌కుమార్‌రెడ్డి, గౌతమ్‌రెడ్డి, భరత్‌ కుమార్‌రెడ్డి ఉన్నారు. ఆయన గత మూడేళ్లుగా పార్కిన్‌సన్‌ వ్యాధితో బాధ పడుతున్నారు. పలుమార్లు తీవ్ర అస్వస్థతకు గురైనా మళ్లీ కో లుకున్నారు. అయితే, వయస్సు విూద పడడం, వ్యాధి ముదరడంతో ఆయన శుక్రవారం పరమపదించారు.1935 ఫిబ్రవరి 20 నెల్లూరు జిల్లాలోని వాకాడులో జన్మించిన నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి రాజకీ యాల్లో కీలక పదవులను అధిష్టించారు. నెల్లూరులో బీఏ, బీఈడీ పూర్తి చేసిన ఆయనకు 1962 మే 25న రాజ్యలక్ష్మితో వివాహం జరిగింది. 1972లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన మూ డుసార్లు లోక్‌సభ సభ్యుడిగా గెలిచారు. ముఖ్యమంత్రిగా, పలు దఫా లుగా మంత్రి పదవులు చేపట్టారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యు డిగా, మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా పని చేశారు. అలాగే, పార్టీ సంస్థాగత పదవులను చేపట్టారు. 1978
నుంచి 83 వరకు మంత్రిగా వ్యవహరించిన నేదురుమల్లి 1990 నుంచి 92 వరకు ముఖ్యమంత్రిగా పని చేశారు. 1988-89లో పీసీసీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. జలగం వెంగళరావు, టి.అంజయ్‌, బి.వెంకట్రామ్‌, కె.విజయభాస్కరరెడ్డి, మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వాలలో మంత్రిగా పని చేశారు. రెవెన్యూ, పరిశ్రమలు, విద్యుత్‌, వ్యవసాయ, అటవీ, ఉన్నత విద్యాశాఖ వంటి కీలక మంత్రిత్వ శాఖలను చూశారు.
నక్సల్స్‌ నిషేధం..
నక్సలైట్లపై నిషేధం విధించింది నేదురుమల్లే. దీంతో ఆయన నక్సలైట్లపై నిషేధం విధించిన తొలి ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. 1992 మేలో నక్సల్స్‌పై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నక్సల్స్‌ కార్యకలాపాలను అణిచివేశారు. దీంతో నేదురుమల్లి నక్సల్స్‌ హిట్‌లిస్ట్‌లో చేరారు. ఫలితంగా ఆయనపై దాడి కూడా జరిగింది. 2007 సెప్టెంబర్‌ 7లో జనార్దన్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారును పేల్చివేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో నేదురుమల్లి, ఆయన సతీమణి రాజ్యలక్ష్మి తృటిలో తప్పించుకున్నారు. దాడిలో ముగ్గురు కార్యకర్తలు మృతి చెందారు. 2003లోనూ ఇదే తరహా దాడి నుంచి ఆయన తప్పించుకున్నారు. రెండేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన జనార్దన్‌రెడ్డి కొత్త ఇంజనీరింగ్‌ కాలేజీలకు అక్రమంగా అనుమతులు ఇప్పించారనే అభియోగాలు వెంటాడడంతో పీఠం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇందిరాగాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉండడంతో తక్కువ సమయంలోనే కీలక బాధ్యతలు చేపట్టారు. రాజకీయాల్లోకి రాకముందు ఉపాధ్యాయుడిగా పని చేసిన నేదురుమల్లి అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. 1978లో అసెంబ్లీకి ఎన్నికైన ఆయన ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. 1998, 99, 2004లలో వరుసగా బాపట్ల, నర్సారావుపేట, విశాఖపట్నం నుంచి మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2009లో రాజ్యసభకు ఎన్నికైన ఆయన కన్నుమూసే వరకు ఆ పదవిలో కొనసాగారు.
ప్రముఖుల సంతాపం
మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్‌ నరసింహన్‌ దిగ్భాంతి వ్యక్తం చేశారు. మంచి రాజకీయ నాయకుడిని రాష్ట్రం కోల్పోయిందని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలువురు ప్రముఖులు నేదురుమల్లి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రి పళ్లంరాజు, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మైసురారెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. తమిళనాడు గవర్నర్‌ కొణిజేటి రోశయ్య, టీడీపీ అధినేత చంద్రబాబు, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, సీపీఐ, సీపీఎం నేతలు నారా యణ, రాఘవులు, పీసీసీ మాజీ చీఫ్‌ డీఎస్‌, కేంద్ర మంత్రి చిరంజీవి, అంజన్‌కుమార్‌యాదవ్‌, మాజీ మంత్రులు కొండ్రు మురళి, వట్టి వసంత్‌కుమార్‌, మండలి బుద్ధ ప్రసాద్‌, చుక్కా రామయ్య, తదితరులు సంతాపం ప్రకటిం చారు. జనార్దన్‌రెడ్డి కుటుంబ సభ్యులను కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహరాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ ఫోన్‌లో పరామర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *