
ఈనెల 16లోగా వివరాలివ్వండి : సీఎస్ మహంతి
హైదరాబాద్, మే 9 (జనంసాక్షి) :
అఖిల భారత సర్వీస్ అధికారులు (ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్)ల విభజనకు సంబంధించి ఆప్షన్స్‌పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధి కారులు ఈనెల 16వ తేదీలోగా తెలంగాణ లేదా ఆంధ్ర రాష్ట్రాల్లో పనిచేసేందుకు ఆప్షన్స్ ఇవ్వాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న అఖిల భారత సర్వీసుల అధికారుల పంపిణీపై కేంద్ర ప్రభుత్వం ఏర్పా టు చేసిన ప్రత్యూష్‌సిన్హా కమిటీ ఆప్షన్స్ ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. గురువారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకోగా దానిని ప్రధానమంత్రి పరిశీలన కోసం పంపారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ ఉత్తర్వులను జారీ చేశారు. తెలంగాణకు 163 ఐఏఎస్, 112 ఐపీఎస్, 65 మంది ఐఎఫ్‌ఎస్ అధికారులను కేటాయించిన విషయం తెలిసిందే. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు 211 ఐఏఎస్, 144 ఐపీఎస్, 82 ఐపీఎస్ పోస్టులు కేటాయించారు. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రంలో 284 మంది ఐఏఎస్, 209 మంది ఐపీఎస్, 136 ఐఎఫ్‌ఎస్ అధికారులు ఉన్నారు. ఇవి పోను మిగతా పోస్టులు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా, పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు.
అఖిల భారత సర్వీసులకు ఆప్షన్స్




