హైదరాబాద్ : అకాల వర్షాలు, నష్టాలపై గవర్నర్ నరసింహన్ సీఎస్, వివిధ జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆయన సూచించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక చర్యలు చేపట్టి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. పంట నష్టం అంచనా త్వరిత గతిన చేపట్టాలని ఆయన పేర్కొన్నారు.
Related