Wednesday, 4 November 2026

కేసీఆరే బ్రోకర్‌


నాకు సంస్కారం ఉంది
నిన్ను తిట్టలేను : పొన్నాల
హైదరాబాద్‌, మే 10 (జనంసాక్షి) :
టీఆర్‌ఎస్‌ అధినేత కేసీ ఆరే బ్రోకర్‌ అని తెలం గాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ క మిటీ అధ్యక్షుడు పొన్నా ల లక్ష్మయ్య తీవ్ర స్థా యిలో విరుచుకుపడా ్డరు. తనపై కేసీఆర్‌ చేసి న విమర్శలను తిప్పికొ డుతూ ఆయన ప్రతి వి మర్శలు గుప్పించారు. పార్టీలు మార్చిన వ్యక్తి, మాటపై నిలబడని వ్యక్తి వాస్తవాలు మాట్లాడు తుంటే జీర్ణించుకోలేకే తనపై దాడికి దిగారని ఆరోపించారు. ఓటమి భయంతో, నిరాశ, నిస్పృహలతో, నిరంకుశత్వంతో, అహంకారంతో దిగజారి
మాట్లాడుతున్నాడని విమర్శించారు. కేసీఆర్‌లా తామూ మాట్లాడగలమని, కానీ, ఆయనలా తప్పుడు భాష మాట్లాడడానికి తనకు చదువు, సంస్కారం అడ్డు వస్తున్నాయని తెలిపారు. పార్టీలు మారిన ఆయన బ్రోకరా? కింది స్థాయి నుంచి పైకి వచ్చిన తాను బ్రోకరా? తేల్చుకోవాలని సూచించారు. శనివారం గాంధీభవన్‌లో పొన్నాల విూడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ తనపై చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. తాను వాస్తవాలు మాట్లాడుతుంటే తట్టుకోలేకే ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్‌ విమర్శలపై స్పందిస్తూ.. తన పని తాను చేసుకుంటున్నానని, కావాలనే ఆయన తనకు పని కల్పిస్తున్నారని తెలిపారు. ‘ఉద్యోగుల పంపకాల్లో స్థానికతను ప్రామాణికంగా తీసుకోవాలని కోరాం. ప్రభుత్వ ఉద్యోగుల అభిప్రాయాలే మా పార్టీ విధానమని చెప్పాం. జెడ్పీ చైర్మన్లు, మండల పరిషత్‌ అధ్యక్షుల ఎన్నికలు సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత చేపట్టాలని కోరాం. అకాల వర్షాల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశాం. కేసీఆర్‌ చెబుతున్నవే మేమూ చెబుతున్నాం. అయినా నా పననిని చూసి ఓర్వలేక నాపై విమర్శలు చేస్తున్నారని’ మండిపడ్డారు. వాస్తవాలు భయటపెడుతుంటే.. నిరాశ, నిస్పృహ నిరంకుశత్వం, అహంకారం, అవగాహన రాహిత్యం, ఆలోచనల లేకుండా దిగజారి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మేం చెబుతున్నవి అసత్యమైతే తప్పని చెప్పండి.. లేదా ప్రజల ముందుకు వచ్చి మాట్లాడండి తప్పితే ఇలాంటి మాటలు మాట్లాడడం తగదన్నారు.
భయంతోనే విమర్శలు..
కేసీఆర్‌ భయంతో, ఏదో ఊహించుకొని ఆరోపణలు చేస్తున్నారని పొన్నాల మండిపడ్డారు. ‘మీ పార్టీని చీలుస్తానని నేను ఎప్పుడు చెప్పలేదే. ఎవరితో మాట్లాడలేదే? విూరు ఊహించి, భయపడి, ఇంత రాద్ధాంతం చేస్తున్నారంటే విూ మనస్సులో భయం ఉంది. అందుకే ఇలా మాట్లాడుతున్నారు. నేనూ మాట్లాడగలను, నా చదువు, సంస్కారం అడ్డు వస్తున్నాయని’ విమర్శించారు. పిల్లి మొగ్గలు వేసే విూరు నన్ను బ్రోకర్‌ అంటారా? అని ప్రశ్నించారు. ‘నేను బ్రోకర్‌నా? నేను విూ పార్టీని చీలుస్తున్నానా? కేసీఆర్‌ తీరు ఉట్టికెక్కలేనమ్మ శాపనార్థాలు పెట్టినట్లుంది. వాస్తవాలను జీర్ణించుకోలేక, సరైన పద్ధతిలో సమాధానాలు చెప్పలేక విమర్శలు చేస్తున్నారు. ఆయన వాదనలో హేతబద్ధత లేకపోవడం వల్లే తాత్కాలిక ఉద్రేకాలు రెచ్చగొడుతున్నారని’ ధ్వజమెత్తారు. రాజకీయ పార్టీలు మార్చిన ఆయన రాజకీయాల గురించి నాకు చెబుతాడా? అని ప్రశ్నించారు. ఉద్యోగుల విభజనపై మార్గదర్శకాలను తెలంగాణ ఉద్యోగుల అభిప్రాయాల మేరకు చేసేలా చట్ట పరిధిలో మా ప్రయత్నాలు చేస్తున్నాం.. అది తప్పా? అని నిలదీశారు.
గిచ్చితే రెచ్చిపోతా..
1978లో సాధారణ కాంగ్రెస్‌ కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చాను. ఈరోజు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడినయ్యా. నీలా నేను దిగజారలేదు. యూత్‌ కాంగ్రెస్‌ నుంచి బయటకు పంపించిన నేపథ్యంలో విూరు ఎన్టీఆర్‌ వద్దకు వెళ్లారు. విూరు చేసిన అక్రమ రవాణా, పాస్‌పోర్టు, తప్పుడు వీసాల కేసు వంటి అసాంఘిక కార్యక్రమాల వల్ల యూత్‌ కాంగ్రెస్‌ బయటకు పంపిస్తారనే భయంతోనే ఎన్టీఆర్‌ వద్ద చేరారు. అభిమానంతో కొడుకు పేరును తారక రామారావుగా పెట్టుకున్నానని ఆయన పార్టీలో చేరారు. చివరకు ఆ పెద్దాయనకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు వద్ద శిష్యరికం చేశాడు. ఆయన వద్ద మంత్రి పదవి సంపాదించాడు. మళ్లీ మంత్రి పదవి ఇవ్వకపోతే తెలంగాణ వాదం తలకెత్తుకున్నాడని’ పొన్నాల తెలిపారు. ఇప్పుడు చెప్పండి రంగులు మార్చింది ఎవరు? బ్రోకర్‌ పనులు చేసింది ఎవరని ప్రశ్నించారు. వీటన్నింటినీ ఏమంటారో ప్రజలే తేలుస్తారన్నారు. ‘నేను విూలా రాజకీయ వేషాలు వేయలేదు.. జాగ్రత్త! గిచ్చితే రెచ్చిపోతాడు పొన్నాల’ అని తెలిపారు.
చీలుస్తానని అనలేదు..
టీఆర్‌ఎస్‌ఎను చీలుస్తానని తానేనాడూ అనలేదని పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులెవరితోనూ సంప్రదింపులు జరపలేదన్నారు. దీనిపై సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. ‘2004లో మాతో పొత్తు పెట్టుకున్నాడు, 2009లో టీడీపీతో జత కట్టాడు, ఇప్పుడు ఎన్నికల ఫలితాలు రాకముందే ఒకసారి ఎన్డీయే మద్దతిస్తాం, మరోసారి యూపీఏకు మద్దతిస్తామంటాడు. అవసరమైతే థర్డ్‌ ఫ్రంట్‌కే మా మాద్దతు అంటాడు. ఆయన ఎప్పడేం మాట్లాడతారో ఆయనకే తెలియదు’ అని విమర్శించారు. దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తానని అని మాట మార్చాడని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో 55 మంది పార్టీ సభ్యత్వం లేని వారికి టికెట్లు ఇచ్చాడు, తెలంగాణ వాదానికి అడ్డు పడిన వారికీ సీట్లు ఇచ్చాడని మండిపడ్డారు. అలాంటి వారు ఎప్పుడు బయటకు పోతారో తెలియదని, ఆ భయంతోనే కేసీఆర్‌పై తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఆకలి, అవహేళనలే తనను అమెరికా పంపాయని, సేవ చేయాలన్న ఉద్దేశ్యంతోనే దేశానికి తిరిగొచ్చి కాంగ్రెస్‌ పార్టీలో చేరానన్నారు. కేసీఆర్‌లా తాను విూ వద్ద ఉన్న దళితులు, గిరిజనులకు అన్యాయం చేయలేదన్నారు. టీఆర్‌ఎస్‌లో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఉన్న విజయరామారావు, రెహమాన్‌, ఇబ్రహీం, శ్రవణ్‌కుమార్‌, చెరుకు సుధాకర్‌, జాజూల సురేందర్‌ పార్టీ నుంచి బయటకు పంపించి, ఇతర పార్టీల నుంచి అరువు తెచ్చుకున్నారని మండిపడ్డారు.
క్యాంపులు కాక మరేమిటి?
ఫలితాలొచ్చాక పార్టీ నేతలను ఢిల్లీ తీసుకెళ్తామనడాన్ని క్యాంపులు కాక మరేమంటారని పొన్నాల ప్రశ్నించారు. ‘మే 16న ఎన్నికల ఫలితాలు వస్తాయి, 17న శాసనసభాపక్షం సమావేశం పెడుతున్నాడు. ఎమ్మెల్యేలు జారిపోతారనే భయంతో ఆ సమావేశం పెడుతున్నాడు. ఎమ్మెల్యేలందరినీ ఢిల్లీకి తీసుకెళ్తారంటా దీన్ని క్యాంపులు నిర్వహించడం అనకుండా ఏమంటారని’ నిలదీశారు. నీ ఇంటిని నువ్వు సక్కగగా పెట్టుకోలేవు నన్ను విమర్శిస్తావా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధిగా జగన్‌ ముఖ్యమంత్రి అవుతాడని ప్రకటించారని ఎద్దేవా చేశారు. ఎవరైనా తన వాళ్లను సీఎం చేయాలని భావిస్తారు. కానీ కేసీఆర్‌ మాత్రం దళితులు, గిరిజనులతో తాను ముఖ్యమంత్రి కావాలని చెప్పిస్తున్నాడు. ఇలా ఆయా వర్గాల ప్రతినిధులతో మాట్లాడించే పరిస్థితి ఎక్కడా చూడలేదని విమర్శించారు. అహంకారం, నిరాంకుశభావం, అధికార దామం ఆయన మాటల్లో నిమిడి ఉంది. అందుకే నాపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ‘ఉక్రోశం, ఆక్రోశంతో వాస్తవాలు బయటపడకుండా ఉంటాయనుకోవడం పొరపాటు. ప్రజా తీర్పును గౌరవిద్దాం, ప్రజలకు మేలు చేసేందుకు పోటీ పడదాం, మన ప్రాంత అభివృద్ధికి కృషి చేద్దామని’ హితవు పలికారు. ఎందుకయ్య మాయమాటలు చెబుతావ్‌. నీ నిజస్వరూపాన్ని నేను బయటపెడుతున్నాననే నాపై మాటలు జారుతున్నావ్‌. నీ రాజకీయ దురహంకారిని నిదర్శనం ఆ మాటలు. ప్రవర్తన తీరు మార్చుకో. ఇలాంటి పోకడలతో నాయకత్వం మనజాలదు, అభివృద్ధి కాజలదు. మాట తీరు సవరించుకోవాలని హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *