Tuesday, 3 November 2026

రేపు ఆరున్నర తర్వాతే ఎగ్జిట్‌పోల్స్‌ సీఈసీ సంపత్‌


న్యూఢిల్లీ, మే 11 (జనంసాక్షి) :
ఎగ్జిట్‌పోల్స్‌పై కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేసింది. తుది విడత సార్వత్రి క ఎన్నికల పోలింగ్‌ సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ముగియనున్న నేపథ్యంలో ఆరున్నర తర్వా త ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలను
వెల్లడించవచ్చని సీఈసీ సంపత్‌ తొలుత వెల్లడించారు. అయితే దేశవ్యాప్తంగా రీపోలింగ్‌ మంగళవారం నిర్వహించనున్న నేపథ్యంలో అవి ముగిసిన తర్వాతే ఎగ్జిట్‌పోల్స్‌ను వెల్లడించాలంటూ మళ్లీ సవరణ ప్రకటన విడుదల చేశారు సీఈసీ సంపత్‌. తొమ్మిదో విడత సార్వత్రిక ఎన్నికలు సోమవారం సాయంత్రం ముగియనుండగా వాటి తర్వాత అరగంటకు ఎగ్జిట్‌పోల్స్‌ను అనుమతిస్తామని తొలుత ప్రకటించింది. ఎగ్జిట్‌పోల్స్‌పై ఎలాంటి సందేహాలున్నా రిప్రసెంటీవ్‌ ఆఫ్‌ పీపుల్స్‌ యాక్ట్‌ 1951లోని 126ఏ సెక్షన్‌ని చూడాలని ఈసీ వెల్లడించింది. రీపోలింగ్‌ నేపథ్యంలో ఓటింగ్‌పై ఎగ్జిట్‌పోల్స్‌ ప్రభావం చూపుతాయని, ఈ నేపథ్యంలో ఎగ్జిట్‌పోల్స్‌, ఓపీనియన్‌ పోల్స్‌ను 13వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు వెళ్లడించకూడదని పేర్కొంది. తమ ఆంక్షలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *