
మందు పాతరకు ఏడుగురు పోలీసుల బలి
గడ్చిరోలి, మే 11 (జనంసాక్షి) :
మహారాష్ట్రలో మావోయిస్టులు పంజా విసిరారు. సార్వత్రిక ఎన్నికల తుది సమరానికి ముందు రోజే మహారాష్ట్రలో మందు పాతర పేల్చి ఏడుగురు పోలీసులను బలితీసుకు న్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా పాయిమొండ అ టవీ ప్రాంతంలో ఆదివారం మావోయిస్టులు పోలీసుల వా హనాన్ని లక్ష్యంగా చేసుకొని మందుపాతర పేల్చారు. ఈ ఘనటలో ఏడుగురు పోలీసులు మృతి చెందగా మరో ము గ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసు పత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమం గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సంఘటన
సమాచారాన్ని అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. గడ్చిరోలి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలను తీవ్రతరం చేశారు. మందుపాతర అనంతరం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగినట్లు సమాచారం.
మహారాష్ట్రలో మావోయిస్టుల పంజా




