Monday, 2 November 2026

ఉభయ గోదావరి జల్లాలో టిడిపి హవా

హైజరాబాద్ : మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో ఉభయగోదావరి జిల్లాల్లో టిడిపి హవా కొనసాగుతోంది. తూర్పు గోదావరిలోని పది మున్సిపాల్టీలలో 8 స్థానాలను టిడిపి కైవసం చేసుకుంది. తుని, రామచంద్రాపురం, పిఠాపురం, మండపేట, ఏలేశ్వరం, పెద్దాపురం, సామర్లకోట, అమలాపురం స్థానాల్లో విజయం సాధించింది. మిగిలిన రెండు స్థానాలు గొల్లప్రోలు, ముమ్మిడివరంలో ఏ పార్టీ స్పష్టమైన ఆధిక్యత సాధించలేక పోయింది. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏడు స్థానాల్లో టిడిపి గెలుపొందింది. తాడేపల్లి గూడెం, తణుకు, కొవ్వూరు, జంగారెడ్డి గూడెం, నిడదవోలు, భీమవరం, పాలకొల్లులను టిడిపి కైవసం చేసుకోగా నరసాపురంలో ఏ పార్టీకి కూడా స్పష్టమైన ఆధిక్యత రాలేదు. రెండు జిల్లాలలోనూ వైఎస్సార్సీపీ అసలు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. కాంగ్రెస్ కూడా ఇక్కడ ఖాతాను నమోదు చేసుకోలేదు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *