Wednesday, 4 November 2026

జయ ఆస్తుల కేసు కొనసాగింపు : సుప్రీం

న్యూఢిల్లీ, మే 13 (జనంసాక్షి) :
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న తమిళనా డు ముఖ్యమంత్రి జయలలితపై విచారణలో ఉన్న కేసు వాయిదాకు కోర్టు నిరాకరించింది. జయల లితపై అవినీతి కేసు విచారణ ప్రస్తుతం బెంగళూ ర్‌లోని ఓ కోర్టులో సాగుతోంది. ఈ కేసులో వా యిదాను కోరుతూ లెక్స్‌ ప్రాపర్టీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచా రించిన జస్టిస్‌ బీఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ ఏకే సిక్రీ లతో కూడిన ధర్మాసనం వాయిదాకు నిరాకరిం చింది. లెక్స్‌ ప్రాపర్టీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆస్తులను జయలలితకు బినామీవిగా చూపించారని, అయితే అవి సదరు సంస్థకే చెందిన ఆస్తులుగా చెప్పడా నికి అవసరమైన పత్రాలు తనవద్ద ఉన్నాయని న్యా యవాది రంజిత్‌కుమార్‌ ధర్మాసానికి విన్నవించు కున్నారు. కంపెనీకి చెందినది సివిల్‌ కేసుకాగా, జయలలితపై ఉన్న క్రిమినల్‌ కేసని, రెండింటినీ ఎలా ముడిపెడతామని ధర్మాసనం ప్రశ్నించింది. ఈకేసులో తదుపని విచారణ గురువారానికి వా యిదా వేసిది. అయితే జయలలిత తరపున వాదిం చడానికి ఆమె న్యాయవాదికి ధర్మాసనం ఈనెల 19న అనుమతి ఇచ్చింది. జయలలితతో పాటు మరో ముగ్గురుపై కేసు నమోదైంది. 1991 నుం చి 96 మధ్యకాలంలో రూ.66.65 కోట్ల ఆస్తికి సంబంధించిన కేసు విచారణ పాదర్శకంగా జరిగేందుకు సుప్రీం కోర్టు
2003లో దాని విచారణను చెన్నై నుంచి బెంగళూరుకు బదలాయించింది. ఈ కేసులో నిందితులుగా జయలలిత, వీకే శశికళ, వీఎన్‌. సుధాకరన్‌, జె.ఇళవరసి ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *