
హైదరాబాద్, మే 13 (జనంసాక్షి) :
కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి మంగళవారం సచివాలయంలో హల్‌చల్ చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రి యను పర్యవేక్షించేందుకు సచివాలయానికి వచ్చిన ఆయన పావుగంట పాటు సెక్రటేరియట్‌లో గడిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్న హెచ్ బా ్లక్‌నూ సందర్శించారు. అక్కడ చేపట్టిన నిర్మాణ పనులను పరిశీలించారు. కిండర్‌గార్డెన్ స్కూల్ వద్ద గేట్ నిర్మాణ పను లను తనిఖీ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రాకపోకల కో సం ఈ గేట్‌ను నిర్మిస్తున్నారు. అంతకుముందు డీజీపీ ప్రసా దరావు, గోస్వామిని కలుసుకున్నారు. పోలీసు శాఖలో ఉద్యో గుల విభజన, ఇతర అంశాలపై శాఖాపరంగా తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర డీజీపీ ప్రసాదరావు కేంద్ర ¬ంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామిని లేక్‌వ్యూ అతిథిగృహంలో కలిసి వివరించారు. రెండు రాష్ట్రాల ప్రజలకు ఇప్పుడు అందిస్తున్నట్లుగానే సేవలు అందించడానికి చేపట్టిన చర్యల గురించి వివరించారు. పాలనాపరంగా ఇబ్బందులు తలెత్తకుండా రెండు డీజీపీ కార్యాలయాల నిర్వహణకు భవనాల కేటాయింపు సీనియర్ ఐపీఎస్ అధికారులతో సమావేశమై చర్చించిన వివిధ అంశాలను కూడా వివరించారు.




