ప్రజాతీర్పును గౌరవిస్తాం : పొన్నాల
హైదరాబాద్, మే 14 (జనంసాక్షి) :
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధీమా వ్యక్తం చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓట్ల శాతంలో తమదే ముందంజ అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు తగ్గాయి కానీ, ఓట్లు తగ్గలేదని చెప్పారు. మెజార్టీ జిల్లా పరిషత్‌లతో పాటు ఎంపీపీలను దక్కించుకొంటామన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని తెలిపారు. స్థానిక సంస్థల ఫలితాలు వెల్లడైన అనంతరం పొన్నాల బుధవారం గాంధీభవన్‌లో విూడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కే ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పారు. అత్యధిక ఎంపీటీసీలతో పాటు పెద్ద సంఖ్యలో జడ్పీటీసీలను గెలిచామన్నారు. స్థానిక పోరులో ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని.. అయితే, తమకు సీట్లు తగ్గాయి కానీ ఓట్ల శాతం మాత్రం తగ్గలేదన్నారు. తెలంగాణలోని ఐదు జిల్లా పరిషత్‌లలో అధికారం తమదేనని పొన్నాల విశ్వాసం వ్యక్తం చేశారు. హంగ్ ఏర్పడిన నాలుగు జిల్లా పరిషత్‌లు కైవసం చేసుకొనేందుకు స్థానిక నాయకత్వం చర్చలు జరుపుతోందన్నారు. హంగ్ ఏర్పడిన చోట మిత్రపక్షాలు తమకు సహకరిస్తాయని తెలిపారు. ఎంఐఎం, సీపీఐతో తమకు అవగాహన ఉందని.. మిత్రపక్షాల సహకారం ఉంటుందన్నారు. ఎంఐఎం కూడా తమకు మిత్రపక్షమేనని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. జూన్ 2 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని పొన్నాల ధీమా వ్యక్తం చేశారు. మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో కాంగ్రెస్ ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్సే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ఎన్నికల ఫలితాలపై సర్వేలు ఊహాగానాలేనని ఆయన స్పష్టం చేశారు. ఎగ్జిట్ పోల్స్‌ను తాను నమ్మనని, వాస్తవ ఫలితాలు వచ్చే వరకూ వేచి చూద్దామన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ అధికారం చేపట్టనుందన్న లగడపాటి వ్యాఖ్యలపై స్పందించేందుకు పొన్నాల నిరాకరించారు. ఉత్తర తెలంగాణలో టీఆర్‌ఎస్ బలంగా ఉందని ఆయన అంగీకరించారు. అయితే, తాము కూడా మంచి సీట్లు సాధించామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో చేసిన చట్టాలను సవిూక్షించి మార్పులు చేస్తామని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో 3 వేలకు పైగా చట్టాలు చేశారని.. ఆయా చట్టాలను తెలంగాణకు అనుకూల రీతిలో మార్చడంతో పాటు పటిష్టం చేయాల్సి ఉందని తెలిపారు. ఇందుకోసం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు.
తెలంగాణ పీఠం మాదే





