Tuesday, 3 November 2026

పదో తరగతి ఫలితాలు విడుదల


88.62 శాతం ఉత్తీర్ణత శ్రీఅమ్మాయిలదే హవా
తెలంగాణలో వరంగల్‌ ఫస్ట్‌ శ్రీఆదిలాబాద్‌ లాస్ట్‌
హైదరాబాద్‌, మే 15 (జనంసాక్షి) :పదో తరగతి ఫలితాలను గురువారం గవర్నర్‌ సల హాదారు సలావుద్దీన్‌ అహ్మద్‌ గురువారం విడుదల చేశారు. ఈ సారి ఫలితాల్లో స్వల్ప పురోగతితో 88.62శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అలాగే పదో తరగతి ఫలితాల్లో కూడా బా లికలు పైచేయి సాధించారు. బాలురు 87.96 శాతం ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణలో వరం గల్‌ జిల్లా 94.54 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానం సాధించింది. ఉమ్మడి రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. తూర్పుగోదావరి ఓవరాల్‌గా అగ్రస్థానంలో ఉండగా ఆదిలాబాద్‌ చివరి స్థానంలో నిలి చింది. ఫలితాల్లో 96.26 శాతం ఉత్తీర్ణతతో తూర్పుగోదావరి జిల్లా
అగ్రస్థానంలో ,58.31 శాతం ఉత్తీర్ణతతో ఆదిలాబాద్‌ జిల్లా చివరి స్థానంలో ఉంది. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణతా శాతం 0.54శాతం పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,784 పాఠశాలల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. 77 పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 10,61,703 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 9,40,924మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సప్లిమెంటరీ పరీక్షలను జూన్‌ 16 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 88.33 శాతంతో బాలికలు పైచేయి సాధించారు. ఉదయం 11.30 గంటలకు సచివాలయంలోని డి-బ్లాకులోని కాన్ఫరెన్స్‌ హాలులో గవర్నర్‌ సలహాదారు సలావుద్దీన్‌ అహ్మద్‌, మాధ్యమిక విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ విూడియా సమావేశంలో ఫలితాల సీడీని విడుదల చేశారు. ఇక జిల్లాల వారిగా ఫలితాల శాతాన్ని చూస్తే మహబూబ్‌నగర్‌- 93.77హైదరాబాద్‌- 77.29, మెదక్‌- 83.01, నిజామాబాద్‌- 89.31, కరీంనగర్‌- 89.72, ఖమ్మం- 89.78, నల్గొండ- 93.16,వరంగల్‌- 94.54, తూర్పుగోదావరి- 96.26, పశ్చిమగో దావరి- 85.37, కృష్ణా- 90.52, గుంటూరు- 91.68, విశాఖపట్నం- 90.86, విజయనగరం- 91.8, శ్రీకాకుళం- 91.68,ప్రకాశం- 87.56, నెల్లూరు- 88.05, చిత్తూరు- 92.87, కర్నూలు- 93.23, కడప- 95.14, అనంతపురం- 87.62శాతం ఉత్తీర్ణత సాధించాయి.10 రోజుల్లో టెన్త్‌ మా ర్కుల జాబితా ఆయా పాఠశాలలకు పంపనుట్లు వారు తెలిపారు. రీకౌంటింగ్‌, రీవాల్యూషన్‌లకు ఈనెల 30 వరకు చివరి తేదీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *