Tuesday, 3 November 2026

కాలిఫోర్నియాలో కార్చిచ్చు


కాలిఫోర్నియా, మే 15 (జనంసాక్షి) :
అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు దావానలంలా వ్యాపిస్తూనే ఉంది. బుధవారం దక్షిణ కాలిఫోర్నియాలోని అడవుల్లో తొమ్మిది చోట్ల మంటలు చెలరేగడంతో 9,095 ఎకరాల మేర మంటలు వ్యాపించాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో విపరీతమైన వేడి గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే 20 వేల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు, ఒక యూనివర్సిటీ, న్యూక్లియర్‌ప్లాంట్‌, సైనిక స్థావరాలను కూడా ఖాళీ చేయించారు. బలమైన గాలులతో మంటలు మరింతగా విస్తరిస్తున్నాయి. మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నామని అమెరికా ఫైర్‌ డివిజన్‌ చీఫ్‌ దేవ్‌ అల్లెన్‌ తెలిపారు. అయితే ఈ కార్చిచ్చు వల్ల ఇంతవరకు ప్రాణనష్టంగానీ, ఎవరికైన తీవ్రమైన గాయాలైనట్లు తాము గుర్తించలేదని తెలిపారు. కార్చిచ్చును అదుపులోకి తెచ్చేందుకు అమెరికా ఫైర్‌ డివిజన్‌ అంతా దక్షిణ కాలిఫోర్నియాలోనే మకాం వేసింది. హెలికాప్టర్లు, భారీ ఫైరింజిన్ల ద్వారా మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *