లక్నో : రాయబరేలీ, అమేథీలలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ముందంజలో ఉన్నారు. కాగా 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు స్థానాల్లోనే ఆధిక్యంలో ఉండడం కాంగ్రెస్ పార్టీ దయనీయ స్థితికి నిదర్శనమని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. రాయబరేలి నుండి పోటీ చేస్తున్న సోనియాగాంధీ తన ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి అజయ్ అగర్వాల్ పై 1,55,233 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయితే అమేథీ నుండి బరిలో ఉన్న రాహుల్ తన ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి స్మృతి ఇరాని కంటే కూడా 8022 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Related