Wednesday, 4 November 2026

కేంద్రంలో వికసించిన కమలం


సొంతబలంతోటే సర్కారు
దేశవ్యాప్తంగా బలంగా మోడీ పవనాలు
ఎన్‌డీఏకు 340, యూపీఏకు 58 ఎంపీ స్థానాలు
న్యూఢిల్లీ, మే 16 (జనంసాక్షి)
కేంద్రంలో కమలం వికసించిం ది. కాషాయం రెపరెపలాడిం ది.. హస్తిన పీఠాన్ని బీజేపీ ద క్కించుకుంది. యావద్దేశం ‘న మో’ మంత్రం పఠించింది. దా దాపు మూడు దశాబ్దాల తర్వాత ఒక పార్టీ సొంతంగా అధికారం లోకి వచ్చింది. సొంతంగా దా దాపు 272 సీట్లకు పైగానే సా ధించి హస్తిన పీఠాన్ని అధిష్టిం చింది. మొత్తంగా ఎన్‌డీఏ కూ టమి కడపటి వార్తలు అందేస రికి 340 స్థానాలను తన ఖాతా లో వేసుకుంది. యూపీఏ 58 స్థానాలకు
పరిమితవగా అందులో కాంగ్రెస్‌ పార్టీ సాధించిన స్థానాలు 47 మాత్రమే. కాంగ్రెస్‌తో పోలిస్తే తృతీయ కూటమి ప్రధాని అభ్యర్థులుగా ప్రచారంలో ఉన్న అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీ సంచలన ఫలితాలు నమోదు చేశారు. తమిళనాడులోని 39 పార్లమెంట్‌ స్థానాలకుగాను అన్నాడీఎంకే 37 స్థానాలను దక్కించుకుంది. పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ 34 చోట్ల విజయం సాధించింది. డీఎంకే, బీఎస్పీ కనీసం బోణీ కొట్టలేదు. సీపీఐ ఒకటి, సీపీఎం ఎనిమిది ఆప్‌ 4, బీజేడీ 18, జేడీయూ రెండు, వైసీపీ తొమ్మిది, ఎన్‌సీపీ 5, సమాజ్‌వాదీ ఐదు, పీడీపీ మూడు స్థానాలను, ఐఎన్‌ఎల్డీ రెండు, జేఎఎం రెండు, యూడీఎఫ్‌ 11, ఎల్డీఎఫ్‌ ఐదు, టీఆర్‌ఎస్‌ 11, ఎంఐఎం 1, టీడీపీ 14 స్థానాల్లో విజయం సాధించాయి. పదేళ్ల పాటు ఏలిన యూపీఏ ఘోర పరాజయం పాలైంది. కాంగ్రెస్‌ పార్టీ కంచుకోటను బద్దలు కొడుతూ బీజేపీ అధికారం హస్తగతం చేసుకొంది. మోడీ హవాకు హస్తం చిత్తయింది. కాంగ్రెస్‌ ముఖ్య నేతలు మట్టికరిచారు. గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌, గోవా, జమ్మూకాశ్మీర్‌, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రలలో ఆ పార్టీ ఖాతానే తెరవలేదు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వడోదరా, వారణాసిలలో రెండుచోట్లా గెలుపొందారు. ఎన్డీయే అన్ని రాష్ట్రాల్లోనూ మెజార్టీ స్థానాలు దక్కించుకొంది. గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, హిమాచల్‌ప్రదేశ్‌, అసోం, రాజస్తాన్‌, బీహార్‌, చత్తీస్‌గఢ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, చండీగఢ్‌, ఉత్తరాఖండ్‌లలో ఎన్డీయే సత్తా చాటింది.
బీజేపీ విలాసం.. కాంగ్రెస్‌ విలాపం
దేశవ్యాప్తంగా బీజేపీ హవా కొనసాగింది. జాతీయ చానళ్లు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌, సర్వేలను తలదన్నుతూ ఆ పార్టీ ఊహించని రీతిలో విజయం సాధించింది. సొంతంగా అధికారం చేపట్టేందుకు అవసరమైన 272 మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత స్వంతంగా అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీగా బీజేపీ చరిత్ర సృష్టించింది. బీజేపీ ఆవిర్భావం నుంచి ఇంతవరకూ సాధించని రీతిలో ఆ పార్టీ ఈసారి రికార్డు స్థాయి ఫలితాలను దక్కించుకొంది. 1999లో సాధించిన 190 సీట్లే ఆ పార్టీకి ఇప్పటివరకు అత్యధిక సీట్లు. కానీ ఈసారి మోడీ నేతృత్వంలో బీజేపీ ఆ రికార్డును తిరగరాసింది. 283 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకొని సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక, పదేళ్ల పాటు ఎదురులేకుండా పాలించిన యూపీఏ ఘోరంగా మట్టి కరిచింది. కనీసం వంద స్థానాలు కూడా సాధించలేక చతికిలపడింది. కాంగ్రెస్‌ పార్టీ నూట పాతికేళ్ల చరిత్రలో చూడని ఫలితాలను చవిచూడాల్సి వచ్చింది. కనీసం రెండో స్థానం కూడా ఆ పార్టీకి దక్కలేదు. యూపీఏ కూటమికి 62 స్థానాలు రాగా.. కాంగ్రెస్‌ కేవలం 48 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. బెంగాల్లో మమతాబెనర్జీ, తమిళనాడులో జయలలిత, ఒడిశాలో నవీన్‌పట్నాయక్‌ సత్తా చాటారు. తృణమూల్‌ 34 చోట్ల, అన్నాడీఎంకే 38 స్థానాల్లో బీజేడీ 17 లోక్‌సభ స్థానాలు దక్కించుకొని ఆయా రాష్ట్రాల్లో తమ పట్టు నిలుపుకొన్నాయి.
అంతటా క్లీన్‌స్వీప్‌..
మోడీ హవాతో బీజేపీ భారీ విజయాన్ని దక్కించుకుంది. గుజరాత్‌, రాజస్తాన్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, హిమాచల్‌ప్రదేశ్‌ వంటి కీలక రాష్టాల్ల్రో దాదాపు క్లీన్‌స్వీప్‌ చేసింది. గుజరాత్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. మొత్తం 26 లోక్‌సభ స్థానాలకు అన్ని లోక్‌సభ స్థానాలను దక్కించుకొని ప్రత్యర్థులను మట్టికరిపించింది.బీహార్‌లో 40 సీట్లకు గాను 21 స్థానాల్లో ఆధిపత్యం చాటుకుంది. హిమాచల్‌లో ఉన్న 4 లోక్‌సభ స్థానాలకు గాను నాలుగింటిని కైవసం చేసుకుంది. కర్ణాటకలో 28 సీట్లకు గాను 18 స్థానాలను సొంతం చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని 29 లోక్‌సభ స్థానాలకు గాను 26 సీట్లను సాధించి ప్రభంజనం సృష్టించింది. మధ్యప్రదేశ్‌లో 29 స్థానాలకు 21 స్థానాల్లో గెలుపొందింది. బీహార్‌లో 40 స్థానాలకు గాను 30 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. రాజస్థాన్‌లోనూ బీజేపీ సత్తా చాటింది. మహారాష్ట్రలో 48 సీట్లకు గాను 42 స్థానాల్లో ఆధిపత్యం ప్రదర్శించింది. ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలకు ఏడింటిని సొంతం చేసుకుంది.
మట్టి కరిచిన మహా నేతలు..
యూపీఏ హయాంలో కేంద్ర మంత్రులుగా పని చేసిన చాలా మంది ఓటమి పాలయ్యారు. మోడీ హవాకు తట్టుకోలేక కుదెలయ్యారు. దాదాపు 35 మంది మంత్రులు పరాజయం పాలయ్యారు. కేంద్ర మంత్రులు సుశీల్‌కుమార్‌ షిండే, గులాం నబీ ఆజాద్‌, కపిల్‌ సిబల్‌, స్పీకర్‌ విూరాకుమార్‌ సహా చాలా మంది పరాజయం పాలయ్యారు. ఢిల్లీ, గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూకాశ్మీర్‌ సహా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఖాతానే తెరవలేదు. పశ్చిమ బెంగాల్‌లో మమత బెనర్జీ సత్తా చాటారు. 42 సీట్లకు 35 స్థానాలు దక్కించుకొని తన ప్రాభవాన్ని నిలుపుకొన్నారు. ఇక, జాతీయ రాజకీయాలపై కన్నేసిన తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత హవా కొనసాగింది. 38 లోక్‌సభ స్థానాలకు 31 చోట్ల ఆధిపత్యం చాటుకున్నారు.
ఓడలు బళ్లు.. బళ్లు ఓడలు అవడమంటే ఇదేనేమో! రెండు సీట్లతో మూడు దశాబ్దాల క్రితం ప్రస్థానం ప్రారంభించిన బీజేపీ.. అత్యధిక స్థానాలు గెలుచుకొని ప్రస్తుతం సొంతంగా అధికారం చేపట్టింది. నూట పాతికేళ్ల చరిత్ర, 415 సీట్లు సొంతంగా సాధించిన రికార్డు కలిగిన కాంగ్రెస్‌ మట్టి కరిచింది. కనీసం 50 సీట్లు కూడా దక్కించుకోకుండా ఘోర పరాజయం మూటగట్టుకుంది. శుక్రవారం వెల్లడైన ఎన్నికల ఫలితాలతో బీజేపీ పూర్తి స్తాయి మెజార్టీ సాధించి చరిత్ర సృష్టించింది. గత పాతికేళ్లుగా సొంతంగా ఏ పార్టీ కూడా అధికారంలోకి రాలేదు. సంకీర్ణ యుగంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం బీజేపీకి మాత్రమే దక్కింది. 1989 తర్వాత నుంచి కేంద్రంలో సంకీర్ణ లేదా మైనార్టీ ప్రభుత్వాలే ఏర్పడ్డాయి. కానీ దాదాపు మూడు దశాబ్దాల అనంతరం బీజేపీ మ్యాజిక్‌ ఫిగర్‌ 272 సీట్లను సాధించి సొంతంగా అధికారం చేపట్టింది. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ ప్రభావంతో హస్తిన పీఠాన్ని సొంతం చేసుకుంది. 117 సీట్లకే పరిమితమైన కమలం 2014 ఎన్నికల్లో 280కి పైగా సీట్లు కైవసం చేసుకొని సత్తా చాటింది. స్వతంత్ర భారతావనిలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఈ విధంగా అధికారంలోకి రావడం ఇది రెండోసారి మాత్రమే. ఎమర్జెన్సీ తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ అధికారం చేపట్టింది.1980లో జనతా పార్టీను వేరుపడిన బీజేపీ నాలుగో సారి అధికారం చేపట్టనుంది. 1996లో బీజేపీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ సరైన మెజార్టీ లేకపోవడంతో 13 రోజులకే ప్రభుత్వం నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆ తర్వాత 1998లో ఎన్డీయే కూటమిగా ఏర్పడి అధికారం చేపట్టిన బీజేపీ.. 13 నెలల పాటు ప్రభుత్వాన్ని కొనసాగించింది. కార్గిల్‌ యుద్ధం తర్వాత 1999 ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. అటల్‌ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో పూర్తి కాలం పని చేసింది. ఆ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 182 సీట్లు సాధించింది. ఇప్పటివరకు ఆ పార్టీ సాధించిన అత్యధిక సీట్లు ఇవే. కానీ, మోడీ నేతృత్వంలో ఆ రికార్డును తిరగరాస్తూ 2014 ఎన్నికల్లో కాషాయం పార్టీ 280కి పైగా సీట్లు సొంతం చేసుకుంది. 1980లో పార్టీ ఆవిర్భవించిన అనంతరం 1984లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో సెంటిమెంట్‌ ప్రభావం భారీగా ఉండడంతో కాంగ్రెస్‌ ఘన విజయం నమోదు చేసింది. కాషాయ పార్టీకి కేవలం రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌లో మాత్రమే ఆ సీట్లు లభించాయి. వాజ్‌పేయి సహా మహా నేతలంతా ఆ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఇక, కాంగ్రెస్‌ పార్టీ కూడా రెండు సార్లు మాత్రమే అత్యల్ప సీట్లు దక్కించుకుంది. 1999, 2014 ఎన్నికల్లో హస్తం పార్టీకి తక్కువ సీట్లు వచ్చాయి. ఆ రెండుసార్లు కూడా సోనియాగాంధీ నేతృత్వంలోనే కావడం విశేషం. సీతారాం కేసరి తర్వాత 1998లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సోనియా.. ఆ తర్వాత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్నారు. దాదాపు ఎనిమిదేళ్ల అనంతరం మే 2004లో అధికారంలోకి వచ్చేందుక సోనియా ప్రయోగాలు ప్రారంభించారు. మిత్రపక్షాలతో కలిసి అధికారాన్ని పంచుకోవాలన్న ఆమె వ్యూహం రెండు దఫాలుగా అధికారాన్ని కట్టబెట్టింది. 1991లో రాజీవ్‌గాంధీ హత్యానంతరం అధికారంలోకి వచ్చిన పీవీ నర్సింహారావు.. మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపించారు. ఆయన ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన మన్మోహన్‌సింగ్‌ తీసుకొచ్చిన కీలక ఆర్థిక సంస్కరణలు భారత గతినే మార్చివేశాయి. ఇప్పడు అదే రీతిలో మోడీ కూడా తన అభివృద్ధి నమూనాతో ప్రజల్లోకి వెళ్లి విజయం సాధించారు. ధరల పెరుగుదల, అవినీతి, నిరుద్యోగం, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అధికారం చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *