ఈ విజయం దేశ ప్రజలది : మోడీ శ్రీగెలిచిన వెంటనే తల్లి ఆశీస్సులు
అహ్మదాబాద్, మే 16 (జనంసాక్షి) :
స్వతంత్ర భారతదేశంలో జన్మిం చిన తొలి ప్రధానిని తానేనని బీజే పీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ అన్నారు. 16వ లోక్‌సభ ఎన్ని కల్లో ఎన్‌డీఏ అఖండ విజయం సాధించిన తర్వాత ఆయన మీడియాతో
మాట్లాడారు. ‘మనకు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనే అవకాశం లభించలేదు, కానీ దేశప్రజల స్వప్నాలు సాకారం చేసే అవకాశం లభించిందని అన్నారు. దేశంలో సురాజ్యాన్ని నెలకొల్పే అవకాశం లభించిందన్నారు. తనను అఖండ మెజార్టీతో గెలిపించిన వదోదర ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇంత భారీ మెజార్టీ గతంలో ఎవరికీ దక్కలేదన్నారు. ఈ సందర్భంగా మోడీ తన గురించి ఒక కొత్త విషయాన్ని ప్రకటించారు. స్వాతంత్యం వచ్చి ఇన్నేళ్ల తరవాత దేశానికి స్వాతంత్య్రానికి ముందు పుట్టినవారే ప్రధానమంత్రులయ్యారని, తొలిసారిగా స్వతంత్ర భారతదేశంలో పుట్టిన వ్యక్తి దేశ ప్రధాని కాబోతున్నారని మోడీ కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. వదోదరలో ఆయన జరిగిన సభలో ఉద్వేగంగా మాట్లాడారు. నేటినుంచి మన కష్టాలకు సెలవని భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన దేశానికి ఇవాళ శుభదినమన్నారు. ప్రజలు అభివృద్ధికి పట్టంకట్టారని, భారత దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో కొత్త ఒరవడని మోడీ పేర్కొన్నారు. వడోదరాను దేశంలోని అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దుతానని మోడీ హామీ ఇచ్చారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారి పూర్తిస్థాయి మెజారిటీతో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడబోతోందని ఆయన కరతాళ ధ్వనుల మధ్య చెప్పారు. ఈ ఎన్నికల్లో గుజరాత్ అధ్భుతమైన పాత్ర పోషించిందన్నారు. ఎక్కడ ఉన్నానన్నది కాదు, ఏం చేస్తున్నానన్నదే తనకు ముఖ్యమని మోడీ చెప్పారు. నేటి విజయం తనదో, తన పార్టీతో కాదని ఈ దేశ ప్రజలది ప్రజాస్వామ్య విధానానిది అని భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. భాజపాపై, తనపై నమ్మకం ఉంచి గెలిపించిన దేశప్రజలకు ఆయన పలుమార్లు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీయే భాగస్వాములందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. ఓటర్లందరికీ శిరసు వంచి అభివాదం చేస్తున్నానని నరేంద్రమోడీ అన్నారు. ఈ ఎన్నికల్లో ఒక్కో ఓటరు ఒక్కో మోడీలా పనిచేశారన్న ఆయన తన భుజాలవిూద దేశప్రజలు పెద్ద బరువు బాధ్యతలు మోపారన్నారు. మోడీ ప్రసంగించడానికి వచ్చిన చాలాసేపటివరకు ఆయనను మాట్లాడనీయకుండా ప్రజలు మోడీ మోడీ అంటూ నినదిస్తూ పెద్దపెట్టున కరతాళధ్వనులు చేశారు. ఓటు వేసి తనను, తన పార్టీని గెలిపించిన ఓటర్లందరికీ మోడీ కృతజ్ఞతలు తెలిపారు. వడోదరలో తనకు వచ్చిన మెజార్టీ దేశంలో ఎవరికీ రాలేదన్నారు. 5.70 లక్షల మెజార్టీ.. ఈ రికార్డ్ తన సొంతమని చెప్పారు. వడోదర సభలో మోడీ మాట్లాడుతున్నంత సేపు సభా ప్రాంగణం మోడీ…మోడీ.. అంటూ ¬రెత్తింది. మోడీ ప్రసంగానికి జనం జేజేలు కొట్టారు. ఈ రికార్డ్ నా సొంతం, విజయం కోసం కృషి చేసిన ఎన్డీయే పక్షాలందరికీ తాను కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. దేశంలో ఇప్పుడు కాంగ్రెస్సేతర ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ఇంతకాలం సంకీర్ణ ప్రభుత్వాలు దేశాన్ని పాలించాయన్నారు. కాంగ్రెసు పార్టీకి ప్రత్యామ్నాయంగా ప్రజలు బిజెపికి సంపూర్ణ మెజార్టీ ఇచ్చారన్నారు. రాజకీయ పండితుల అంచనాలు అన్నీ తలకిందులయ్యాయన్నారు. స్వతంత్ర భారత దేశంలో తొలిసారి స్వతంత్రంగా అధికారం దక్కించుకున్న కాంగ్రెస్సేతర పార్టీ బిజెపియే అన్నారు. ప్రభుత్వాలు ఏ కొందరి కోసమే కాకుండా ప్రజలందరి కోసం పని చేయాలన్నారు. ప్రజల్లో విశ్వాసం నింపడంలో బిజెపి విజయం సాధించిందన్నారు. దేశం కోసం జైలుకు వెళ్లేందుకు లేదా ప్రాణత్యాగం చేసేందుకు అవకాశం రాకపోయినప్పటికీ సురాజ్యం కోసం ముందుకు సాగుదామన్నారు. స్వాతంత్రం వచ్చిన తరవాత జన్మించిన వ్యక్తి తొలిసారి ప్రధాని కాబోతున్నారన్నారు.




