Tuesday, 3 November 2026

ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రాజీనామా


15వ లోక్‌సభ రద్దుకు కేబినెట్‌ సిఫార్సు శ్రీరాష్ట్రపతి ఆమోదం

అపద్ధర్మంగా కొనసాగండి : రాష్ట్రపతి

న్యూఢిల్లీ, మే 17 (జనంసాక్షి) : ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ శని వారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి సమర్పించారు. అలాగే, 15వ లోక్‌సభ రద్దుకు కేబినెట్‌ చేసిన తీర్మానాన్ని రాష్ట్రపతికి అందజే శారు. దీంతో మన్మోహన్‌ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకూ ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని నడి పించాలని ప్రణబ్‌ మన్మోహన్‌ను కోరారు. లోక్‌సభ ఎన్నికల్లో కాం గ్రెస్‌ పార్టీ ఘోర ఓటమి నేపథ్యంలో యూపీఏ పదేళ్ల పాలనకు తెర పడింది. ఫలితాలు వెల్లడైన మరుసటి రోజే మన్మోహన్‌ తన పద వికి రాజీనామా చేశారు. 81 సంవత్సరాల మన్మోహన్‌ తన రాజీన మాతో పాటు మంత్రిమండలిని రద్దు చేయాలని కోరుతూ సిఫార్సు లేఖలు అందజేశారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పి స్తూ.. 15వ లోక్‌సభ రద్దయింది. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలో కేంద్ర క్యాబినెట్‌ శనివారం

చివరి సారిగా సమావేశమైంది. లోక్‌సభ రద్దుకు సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2014 ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతి రోజే కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ రద్దుకు నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా 15వ లోక్‌సభను రద్దు చేయాలని కోరుతూ మంత్రిమండలి తీర్మానించింది. లోక్‌సభను రద్దు చేయాలని సభాపక్ష నాయకుడు, ¬ం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ప్రవేశపెట్టిన తీర్మానానికి క్యాబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ఈ సందర్భంగా ప్రధానిగా పదేళ్ల పాటు మన్మోహన్‌ అందించిన సేవలను మంత్రివర్గ సభ్యులు కొనియాడారు. అనంతరం తన మంత్రివర్గ సభ్యులకు మన్మోహన్‌ తేనీటి విందు ఇచ్చారు. అనంతరం మన్మోహన్‌సింగ్‌ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిశారు. క్యాబినెట్‌ భేటీ ముగిసిన అనంతరం మన్మోహన్‌ నేరుగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. రాష్ట్రపతికి తన రాజీనామా లేఖను సమర్పించారు. అలాగే, లోక్‌సభ రద్దుకు క్యాబినెట్‌ చేసిన తీర్మానాన్ని ప్రణబ్‌కు అందజేశారు. వాహనం వరకు వచ్చి మన్మోహన్‌సింగ్‌కు రాష్ట్రపతి వీడ్కోలు పలికారు. 2004, 2009లో రెండుసార్లు ప్రధానిగా ఎన్నికైన మన్మోహన్‌ పదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు.

రాజీనామా ఆమోదం..

మన్మోహన్‌ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకూ కొనసాగాలని సూచించారు. ‘మన్మోహన్‌సింగ్‌ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. నూతన ప్రభుత్వం ఏర్పాడే వరకూ కొనసాగాలని మన్మోహన్‌ను, ఆయన మంత్రివర్గ సభ్యులను కోరారని’ రాష్ట్రపతి భవన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. మన్మోహన్‌ క్యాబినెట్‌లో ప్రణబ్‌ ముఖర్జీ మంత్రిగా వ్యవహరించారు. ఆర్థిక, రక్షణ, విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖలను నిర్వర్తించారు.

ఒడిదొడుకుల ప్రస్థానం..

నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత ఎక్కువ కాలం పని చేసిన ప్రధానిగా మన్మోహన్‌ గుర్తింపు పొందారు. 2004 మే 22 నుంచి 2014 మే 17 వరకూ ఆయన పదవిలో కొనసాగారు. అనేక ఒడిదొడుకులను ఎదుర్కొని ప్రభుత్వాన్ని విజయవంతంగా పదేళ్ల పాటు నడిపించారు. మంచి ఆర్థిక వేత్తగా, సంస్కరణలకు ఆద్యుడిగా గుర్తింపు పొందిన మన్మోహన్‌ మంచి పాలనాదక్షుడిగా నిరూపించుకోవడంలో విఫలమయ్యారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో, అవినీతి, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో వైఫల్యం చెందారు. సోనియా కుటుంబానికి వీర విధేయుడిగా బాధ్యతలను వారికే దఖలు పరిచారనే అపవాదు మూటగట్టుకున్నారు. నీతి నిజాయతీలకు, విశ్వసనీయతకు మారుపేరైన సింగ్‌.. పదవి నుంచి దిగిపోయే సరికి అవినీతి ‘మసి’పూసుకున్నారు. పదేళ్ల పాలనలో అనేక కుంభకోణాలు వెలుగు చూడడంతో ఆయన ప్రతిష్ట మసకబారింది. బొగ్గు కుంభకోణంలో స్వయంగా ఆయనే విమర్శలు ఎదుర్కోవడం వైచిత్రి. ఎవరెన్ని విమర్శలు గుప్పించినా తన పని తాను చేసుకుపోయారు మన్మోహన్‌. పదేళ్ల కాలంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రావిూణ ఉపాధి హావిూ పథకం, ఆహార భద్రత, సమాచార హక్కు చట్టం, లోక్‌పాల్‌ వంటి కీలక చట్టాలను తీసుకొచ్చారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు. యూపీఏ-1 హయాంలో వృద్ధి రేటు 8 శాతం నమోదు చేసింది. కానీ, ఆ తర్వాత అధినాయకత్వం నేరుగా పాలనలో జోక్యం చేసుకోవడం, సంకీర్ణ రాజకీయాల నేపథ్యంలో మన్మోహన్‌ సర్కారు చేష్టలూడిగి చూడాల్సి వచ్చింది.

పదేళ్ల పాలనలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని భవిష్యత్‌లో భారత్‌ సూపర్‌ శక్తిగా ఎదగాలని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆకాంక్షించారు. శనివారం ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం 15వ లోక్‌సభను రద్దు చేయాలని మంత్రిమండలి తీర్మానం చేయనున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడానికి ముందు మన్మోహన్‌ చివరిసారి ప్రధానిగా జాతినుద్దేశించి ఉద్వేగభరితంగా మాట్లాడారు. దేశ విభజన వల్ల రోడ్డున పడ్డ కుటుంబంలోని ఓ పిల్లాడికి దేశంలో ఇత పెద్ద పదవి ఇచ్చి ఆదరించినందుకు కృతజ్ఞతలు అని అన్నారు. ప్రధానమంత్రి పదవిని వదిలేసిన తర్వాత కూడా భారతీయులందరి ప్రేమాభిమానాలు తనతో ఉన్నాయని ఈ దేశం తనకు ఇచ్చిన ఇంత గొప్ప అవకాశానికి సదా కృతజ్ఞుడినై ఉంటానన్నారు. ఇది చాల పెద్ద గౌరవమని, ఇద తనకు లభించినందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. భారతదేశ భవిష్యత్తు విూద తనకు పూర్తి విశ్వాసం ఉందని ప్రపంచంలో మారుతున్న ఆర్థిక వ్యవస్థలో భారత్‌ బ్రహ్మండమైన శక్తిగా ఎదుగుతుందన్న నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమికి, పదేళ్ల యూపీఏ పాలనకు బాధ్యత వహిస్తున్నానని చెప్పారు. గత పదేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని దేశానికి సేవ చేసే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. రాబోయే నూతన ప్రభుత్వానికి విజయాలు కలగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. మన ప్రజాస్వామ్య ప్రక్రియలో జరిగే ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనన్నారు. ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచేది భారతేనని నేను గట్టిగా నమ్ముతాను. సంప్రదాయ, అధునాతన సమ్మిళితమైన భిన్నత్వంలో ఏకత్వం గల భారత్‌ ప్రపంచానికే మార్గం చూపిస్తుంది. ఇంత గొప్ప దేశానికి సేవ చేసే అవకాశం రావడం నా అదృష్టం’ అని అన్నారు. 2004 నుంచి విజయవంతంగా ప్రభుత్వాన్ని నడిపిన ఆయన పదేళ్ల యూపీఏ పాలనకు బాధ్యత వహిస్తున్నాని తెలిపారు. జాతిని ముందుకు నడిపించడంలో తన వంతు బాధ్యత నిర్వర్తించానన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకమని ఎప్పుడూ దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే పని చేశానన్నారు. గత పదేళ్ల యూపీఏ పాలనలో దేశం ఎన్నో విజయాలు నమోదు చేసిందని, ఇద తమకెంతో గర్వకారణమని చెప్పారు. గత దశాబ్ద కాలంలో భారత్‌ బలోపేతమైందని.. ఇందుకు సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాబోయే సర్కారు కూడా తమ పనిలో విజయం సాధించాలని.. దేశానికి మరిన్ని విజయాలు లభిస్తాయని ఆకాంక్షించారు. ప్రధానిగా ఇదే తన చివరి మీడియా సమావేశమన్న మన్మోహన్‌.. జై హింద్‌ అంటూ ప్రసంగం ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *