హైదరాబాద్, మే 17 (జనంసాక్షి) :
మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ఒక ఈవీఎం మొ రాయించడంతో ఈ నియోజకవర్గంలోని 119వ బూత్‌లో 19న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈవీఎం పూరి ్తగా డెడ్ కావడంతో సమాచారం సేకరించడం సాధ్యం కాలేదు. ఇంజినీర్లు ఎంతగా ప్రయత్నించి నప్పటికీ, ఈవీఎం పని చేయలేదు. ఈ నేపథ్యం లో ఏం చేయాలనే దానిపై అధికార యంత్రాం గం మల్లగుల్లాలు పడుతోంది. రెండు పార్టీల మ ధ్య దోబూచులాడుతున్న విజయం చివరకు ఎవరి కి దక్కుతుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొం ది. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవ ర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వంశీచంద్‌రెడ్డి,
బీజేపీ నుంచి ఆచారి బరిలో నిలిచారు. శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ఫలితాల్లో చివరి రౌండ్‌లో వంశీచంద్‌రెడ్డికి 157 ఓట్ల స్వల్ప ఆధిక్యం లభించింది. అయితే, జూపల్లి గ్రామ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ఈవీఎం మొరాయించడంతో ఓట్ల లెక్కింపు సాధ్యపడలేదు. దీంతో కల్వకుర్తి నియోజకవర్గ ఫలితాన్ని నిలిపివేశారు. ఈవీఎంను సీజ్ చేసి భద్రపరిచారు. మెజార్టీ 157 మాత్రమే ఉండడం, ఈవీఎం తెరుచుకుంటే కానీ ఫలితం ప్రకటించే అవకాశం లేదు. కల్వకుర్తి నియోజకవర్గంలో పని చేయని ఈవీఎంను శనివారం ఉదయం ఈసీఐఎల్‌కు చెందిన ఇంజినీర్ల బృందం పరిశీలించింది. కలెక్టర్ సమక్షంలో ఈవీఎంను పరిశీలించారు. దాన్ని తెరిచేందుకు ఇచ్చిన కోడ్‌కు ఈవీఎం స్పందించలేదు. దీంతో ఈవీఎం ఇక పని చేయదని, దాన్నుంచి సమాచారం సేకరించడం సాధ్యం కాదని ఇంజినీర్ల బృందం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై అధికార యంత్రాంగం ఈసీకి నివేదించింది. జూపల్లి ఈవీఎం పని చేయట్లేదని కలెక్టర్ గిరిజాశంకర్ ప్రకటించారు. ఈసీఐఎల్‌కు చెందిన ఇంజినీర్ల బృందం ప్రయత్నించినప్పటికీ ఈవీఎం తెరుచుకోలేదని దీంతో అది పని చేయదని నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. దీనిపై ఎన్నికల సంఘానికి నివేదిక పంపామని అక్కడి నుంచి ఆదేశాలు రాగానే నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రీపోలింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ గిరిజాశంకర్ తెలిపారు.





