Wednesday, 4 November 2026

చల్లని ముచ్చట


నైరుతి రుతుపవనాలు ప్రవేశం
హైదరాబాద్‌, మే 18 (జనంసాక్షి) :
ఎండ వేడిమికి తట్టుకోలేక పోతున్న ప్రజలకు చల్లని ముచ్చట. నైరుతి పవనాలు ఆగ్నేయ బంగాళాఖాతం లోకి ప్రవేశించాయి. మరో 48 గంటల్లో ఇవి తూర్పు బంగాళాఖాతంలోకి ప్రవేశించే
అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు పేర్కొంటున్నారు. వీటి ప్రభావం వల్ల ఇప్పటికే అండోమాన్‌ తదితర ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. కాగా, రాష్ట్రంలో కూడా వీటి ప్రభావం పడింది. నిన్నటి వరకు హైదరాబాద్‌ నగరంలో ఉన్న 41 డిగ్రీల ఉష్ణోగ్రత ఆదివారం 40కి తగ్గింది. తమిళనాడు, కోస్తాంధ్ర తీరం వరకు అల్పపీడన వ్యాపించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు పేర్కొంటున్నారు. గడిచిన 24 గంటల్లో తాడిపత్రి, పాకలలో 2 సెంటీమీటర్లు, పాడేరు, అరకులోయలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలో పలుచోట్ల చిరుజల్లులు పడ్డాయి. దీంతో ఇక్కడి ప్రజలకు ఎండవేడిమికి కొంత ఉపశమనం లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *