
ఛేదించిన బెంగళూర్ పోలీసులు
సుపారీ అందుకున్న ఆగంతకులు
పోలీసు కాల్పుల్లో కాంట్రాక్టు కిల్లర్ మృతి
హైదరాబాద్, మే 18 (జనంసాక్షి) :
ఎంఐఎం ముఖ్యనేత, చంద్రాయణగుట్ట శాస నసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ హత్యకు పన్నిన కుట్రను బెంగళూరు పోలీసులు ఛేేదించారు. కర్నాటక నుంచి టాటా సఫారీ వాహ నంలో ఓ ముఠా ఆయుధాలతో రాష్ట్రంలోకి ప్రవేశించింది. అ నంతపురం జిల్లా హిందూపురం బార్డర్ చెక్ పోస్టు వద్ద పోలీ సుల తనిఖీల్లో ముఠా పట్టుబ డింది. వీరిని
అరెస్టు చేసి బెంగళూరుకు తరలి స్తుండగా, వారు పారిపోయే ప్రయత్నం చేశా రు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కాంట్రాక్టు కిల్లర్ ఒకరు మరణించినట్టు సమాచారం. చని పోయిన వ్యక్తి కర్ణాటకకు చెందిన గోవింద్ అనే రౌడీషీటర్‌గా పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి గిరికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. ఐదుగురు సభ్యులగల ముఠాలో మిగతా ముగ్గురిని పోలీసులు విచారించగా అక్బరుద్దీన్‌ను హత్యచేయడానికి వెళుతున్నట్టు పేర్కొన్నట్టు సమాచారం. అక్బరుద్దీన్‌ను అంతమొందించడానికి సదరు ముఠా సుపారీ అందుకున్నారు. నిందితుల్లో ఒకరు అక్బరుద్దీన్ సామాజిక వర్గానికి చెందిన వారు ఉండంతో భూవివాదం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నాంపల్లిలోని ఓ స్థల వివాదంలో ఈ ముఠా రంగంలోకి దిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్టు సమాచారం. అయితే, దీనిని పోలీసులు ఉగ్రవాదకోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అక్బరుద్దీన్‌ను హత్యచేయడానికి వస్తున్న ముఠాను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారన్న సమాచారంతో నగరంలోని పాతబస్తీతో పాటు పలు వివాదాస్పద ప్రాంతాల్లో ముఖ్య కూడళ్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2011లో నగరంలోని పాతబస్తీలో అక్బరుద్దీన్‌పై ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడి చేయగా ఆయన మృత్యుముఖం నుంచి బయటపడ్డారు. తీవ్రమైన కత్తిపోట్లకు గురైన అక్బరుద్దీన్ ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. అప్పటి దాడిలో ఎమ్మెల్యే అహ్మద్ బలాలలా అనుచరుడు మృతిచెందిన విషయం తెలిసిందే.
అక్బరుద్దీన్ హత్యకు కుట్ర




