
ఇదిగో తీర్మానం కాపీ శ్రీప్రమాణ స్వీకారానికి ఆహ్వానించండి
శ్రీగవర్నర్‌కు లేఖ అందించిన ఈటెల, పోచారం
హైదరాబాద్, మే 18 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర సమితి శానసభ పక్షం నేతగా కేసీఆరేనని ఆ పార్టీ ముఖ్యనేత ఈటెల రాజేం దర్ అన్నారు. ఆదివారం ఆయన శాసనసభ పక్షనేతగా ఎన్నికైన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకే కలిశామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ గవర్న ర్‌ను కోరామని ఇందుకు సంబంధించిన తీర్మా నం ప్రతిని తనతో పాటు సీనియర్ నేత పోచారం శ్రీనివాస్‌రెడ్డి గవర్నర్‌కు అందజేశార ని చెప్పారు. తమ భేటీకి రాజకీయ ఉద్దేశమే మీలేదని ఈటెల రాజేందర్ తెలిపారు. గవర్నర్ ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పునర్నిర్మాణం చేసే శక్తి, యుక్తి కేసీఆర్‌కు ఉందనే విషయాన్ని గమ నించిన ప్రజలు టీఆర్‌ఎస్‌కు మెజారిటీ ఇచ్చా రని అన్నారు. ప్రజల ఆశలు వమ్ము కాకుండా చేసే శక్తి కేసీఆర్‌కు ఉన్నందునే తాము కేసీఆర్‌ను శాసనసభ పక్షనేతగా ఎన్నుకున్నామ న్నారు. గవర్నర్‌తో అపాయింటెడ్ డే గురించి మాట్లాడలేదని, కేవలం మ ర్యాద పూర్వకంగానే కలిశామన్నారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారం జూన్ రెండో తేదీ తర్వాతే ఉంటుందని అన్నారు. అపాయింటెడ్ డేను ముందుకు జరపాల ని తాము గవర్నర్‌ను కోరలేదన్నారు. అలాగే మిగతా ఏ అంశాలు ప్రస్తావనకు రాలేదని చెప్పారు. తాము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కచ్చి తంగా అమలు చేసి తీరుతామన్నారు. తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా ముందు కు సాగుతామన్నారు. కేసీఆర్ వెంట గవర్నర్‌ను
కలిసిన వారిలో ఆ పార్టీ నాయకులు కె. కేశవరావు, హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావుతో పాటు పలువురు సీనియర్ నాయకులు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నారు.




