12 సెకన్ల పాటు కంపించిన భూమి
భువనేశ్వర్, జార్ఖండ్, రాంచీ ఉత్తరాంధ్రలో ఇళ్లలో నుంచి జనం పరుగులు
అందోళన వద్దు సునామీ లేదు: అధికారులు
హైదరాబాద్, మే 21 (జనంసాక్షి): తూర్పు గోదావరి జిల్లా మొదలుకొని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఒడిశా, జార్ఖండ్ వరకూ పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో సుమారు 12 సెకన్లపాటు భూమి కంపించడంతో భయంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. శ్రీకాకుళం నగరంలోని విశాఖ-ఎ కాలనీ, ఫ్రెండ్స్ కాలనీల్లో నివాసముంటున్న జనం భయాందోళనకు గురయ్యారు. రెండుసార్లు స్వల్పంగా కంపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా లోని తుని, కోటనందూరులో కూడా భూప్రకం పనలు చోటుచేసుకున్నాయి.
సునామీ ముప్పు తప్పినట్టే..
బంగాళాఖాతం కేంద్రంగా భూకంపం ఏర్పడటంతో సునామీ కూడా వస్తుందేమోనని ప్రజల్లో అలజడి రేగింది. అయితే ఈ భూప్రకంపనల
భూకంపంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనం
– బంగాళాఖాతంలో భూకంప కేంద్రం
– సునామీ ముప్పు లేనట్లే
తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదయిందని, ఫలితంగా వూపిరి పీల్చుకున్నారు. అమెరికా వాతావరణ కేంద్రం కూడా సునామీ ప్రమాదం లేదని పేర్కొంది.
ఒడిశా, జార్ఖండ్‌లలో కూడా…
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌తో పాటు జార్ఖండ్‌లోని పలు ప్రాంతాల్లో కూడా బుధవారం రాత్రి భూకంపం సంభవించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు.
– ఒడిశాలోని పరదీవ్కు ఆగ్నేయంగా సుమారు 250కి.మీ దూరంలో బంగాళాఖాతంలో భూకంపం ఏర్పడింది.
– రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 6.0గా నమోదయింది.
– దీని ప్రభావంతో కోల్‌కతా నుంచి చెన్నైవరకు పలు తీరప్రాంతాల్లో భూప్రకంపనలు ఏర్పడినట్టు సమాచారం.
– ఢిల్లీ నగరంలోనూ ప్రకంపనలు ఏర్పడినట్టు తెలిసింది.
– కొన్ని ప్రాంతాల్లో భూప్రకంపనలు 12 నుంచి 15 సెకన్ల పాటు వుండగా, మరికొన్ని ప్రాంతాల్లో 40 సెకన్ల వరకు ఉన్నట్టు సమాచారమందింది.
– అయితే ఈ భూకంప ప్రభావంతో ఎలాంటి సునామీ ప్రమాదం లేదని వాతావరణ కేంద్రం పేర్కొంది.
– తూర్పు తీరప్రాంతంలో భూకంపాలకు కేంద్రం కారు. అయితే సముద్రగర్భంలో భూకంపం సంభవించడం గమనార్హం.
– బంగాళాఖాతంలో అండమాన్, నికోబార్ దీవుల సమీపంలోనే ఎక్కువగా భూకంపాలు సంభవిస్తుంటాయి.
దేశవ్యాప్తంగా భూ ప్రకంపనలు





