Tuesday, 3 November 2026

గుజరాత్‌ ముఖ్యమంత్రి పదవికి మోడీ రాజీనామా


బీజేఎల్పీ నేతగా ఆనందీబెన్‌ పటేల్‌ ఎన్నిక
అహ్మదాబాద్‌, మే 21
(జనంసాక్షి):
గుజరాత్‌ ముఖ్యమంత్రి పదవికి నరేంద్ర మోడీ బుధవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర అసెంబ్లీ మోడీకి ఘనంగా వీడ్కోలు పలికి, ప్రశంసలతో ముంచెత్తింది. పాలక పక్షంతో పాటు ప్రతిపక్షాలు కూడా ఆయన పాలన దక్షతను, సమర్థతను కొని యాడారు. గుజరాత్‌లాగే దేశాన్ని కూడా ఆయన అభివృద్ధి చేస్తారని ఆకాం క్షించారు. అనంతరం అసెంబ్లీలో చివరి సారిగా ప్రసంగించిన మోడీ అంద రినీ ఆకట్టుకున్నారు. గుజరాత్‌ అభివృద్ధి, ప్రతిపక్షాల సహకారం వంటి అం శాలను స్పృశించారు. ప్రతిపక్షాలను గౌర విస్తూ వారిపై ప్రశంసలు కురిపిం చారు. వారి వల్లే తాము తప్పులు సరిది ద్దుకొని ముందుకెళ్లామన్నారు. గుజ రాత్‌ అసెంబ్లీలో ఎన్నో పాఠాలు నేర్చుకు న్నానని, గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా పని చేసిన రోజుల్లో ఎన్నో ఆటుపోట్లు ఎదు ర్కొన్నాని తెలిపారు. గుజరాత్‌ ప్రజలు నాల ుగు సార్లు సీఎంగా అవకా శమిచ్చారని, గుజరాత్‌ అభివృద్ధిలో ప్రతి గుజరాతీ పాత్ర ఉందని వినమ్రంగా తెలిపారు. ఈసారి దేశానికి ప్రధానిగా చేసిన ప్రజలకు తాను రుణపడి ఉంటానని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో పౌరులం దరినీ భాగస్వాములను చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నో కుంభకోణాలతో దేశాభివృద్ధి చితికిపోయిం దని, దేశాభివృద్ధిని గాడిలో పెట్టడమే తన ముం దున్న ప్రధాన లక్ష్యం, సవాల్‌ అని తెలిపారు. సమస్యలను, సవాళ్లను సమర్థవత పాలనతో అధిగమి స్తానన్నారు. కొత్త
ఆలోచనలను సమర్థంగా అమలు చేయడంలోనే విజయం దాగి ఉందన్నారు.
గుజరాత్‌లాగే అభివృద్ధి:ఇదో చారిత్రక విజయమని మోడీ ఉద్ఘాటించారు. ఈ విజయం చారిత్రాత్మకం, ప్రజలు, కార్యకర్తల విజయమని ప్రకటించారు. బీజేపీ మార్క్‌ పాలనకు గుజరాత్‌ అభివృద్ధే నినాదమని అన్నారు. గుజరాత్‌ మాదిరి దేశాన్ని కూడా అభివృద్ధి చేస్తానని మోడీ ప్రకటించారు. ఎన్నికల నుంచి అందరి దృష్టి గుజరాత్‌పైనే ఉందని, ఈ విజయం కార్యకర్తలు, ప్రజలదేనని చెప్పారు. అభివృద్ధిలో గుజరాత్‌ ఓ నమూనాగా నిలిచిందని, గుజరాత్‌ అభివృద్ధికి సాక్ష్యంగా ఎన్నికలు నిలిచాయని తెలిపారు. ప్రతిపక్షంపై మోడీ ప్రశంసలు కురిపించారు. ప్రతిపక్షం వల్ల తప్పులను సరిచేసుకొని ముందుకువెళ్లామన్నారు. సీఎంగా ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నానని తెలిపారు. తుఫాను, భూకంపాలను తట్టుకొని నిలబడ్డామని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు గుజరాత్‌ స్ఫూర్తిదాయకంగా నిలిచిందని కొనియాడారు. అంతకు ముందు మోడీ సన్నిహితుడు అమిత్‌ షా మాట్లాడుతూ ఆయనపై ప్రశంసలు గుప్పించారు. గుజరాత్‌ బిడ్డ ప్రధాని కావడం గర్వంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలను మోడీని ఆదరించారని తెలిపారు. దేశ సమస్యలు పరిష్కరించే సత్తా ఆయనకే ఉందని, సుస్థిర పాలన అందించగల నాయకుడు మోడీ అన్నారు. రెవెన్యూ మంత్రి ఆనందీ పటేల్‌ మాట్లాడుతూ మోడీ వల్లే సమర్థవంతమైన పాలన అందించామని చెప్పారు. గుజరాత్‌ సంస్కృతి, శక్తిని చాటడంలో మహాత్మాగాంధీ, సర్దార్‌వల్లభాయ్‌ పటేల్‌ తర్వాత మోడీయే నిలిచారని పేర్కొన్నారు. విపక్ష కాంగ్రెస్‌ నేత శంకర్‌సింఘ్‌ వాఘేలా కూడా మోడీని ప్రశంసించారు. 1982లో రెండు లోక్‌సభ సీట్లను గెలుచుకున్న పార్టీని మోడీ 282 సీట్లలో గెలిపించారని కితాబునిచ్చారు. ఆయన నాయకత్వంలో దేశం స్వయంసమృద్ధి సాధిస్తుందని, ప్రపంచ దేశాలకు దీటుగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆనందీబెన్‌ వైపు చూపు
ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా రాజీనామా నేపథ్యంలో ఆయన స్థానంలో బీజేపీి సీనియర్‌ నాయకురాలు, సీనియర్‌ శాసన సభ్యురాలు ఆనందీ బెన్‌ పటేల్‌ రానున్నారు. దీంతో ఇప్పుడు సభ్యుల దృష్టి అంతా అటువైపు మళ్లింది. ఇక తమకు కాబోయే, నడిపించే నాయకురాలు ఆమేనని గుర్తించారు. బీజేపీ శాసన సభా పక్షం ఆనందీ బెన్‌ పటేల్‌ను తమ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకోనున్నారు. మోడీ తర్వాత ఆనందీ ముఖ్యమంత్రి అని తెలియడంతో ఆమె ఎవరు అనే అంశంపై చర్చ సాగుతోంది. ఆనందీ బెన్‌ పటేల్‌ 1941 నవంబర్‌ 21న జన్మించారు. ఆమె వయస్సు 72. బిజెపిలో ఆమె వివిధ ¬దాల్లో, ప్రభుత్వంలో పలు శాఖలను నిర్వహించారు. ఆనందీ బెన్‌ పటేల్‌ అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేసినప్పుడు ఆమె ధైర్యసాహసాలు ప్రదర్శించారు. ఇద్దరు విద్యార్థులు నర్మదా నదిలో పడినప్పుడు ఆనందీ బెన్‌ అందులోకి దూకి వారిని రక్షించారు. అప్పుడే బీజేపీ దృష్టిలో పడ్డారు. తొలుత పార్టీలో చేరేందుకు ఆమె నిరాకరించారు. అయితే, ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలు కూడా ఓ మార్గమని భావించిన ఆమె ఆ తర్వాత బీజేపీలో చేరారు. పలు ప్రజా సంబంధ కార్యక్రమాల ద్వారా ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. 1994లో గుజరాత్‌ నుండి రాజ్యసభకు వచ్చారు. 1998లో ఆమెకు విద్యాశాఖ మంత్రిగా చేసే అవకాశం వచ్చింది. 2002-2012 వరకు ఆమె గుజరాత్‌ విద్యాశాఖ, రోడ్‌ అండ్‌ బిల్డింగ్‌, రెవెన్యూ శాఖల మంత్రిగా పని చేశారు. 2012లో ఆమెకు మోడీ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ అర్బన్‌ హౌసింగ్‌ అండ్‌ డిసాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ శాఖను ఇచ్చారు. గుజరాత్‌లో చాలా కాలం ఎమ్మెల్యేగా ఉన్న వారిలో ఆనందీ బెన్‌ ఒకరు. ఆనందీ బెన్‌ పటేల్‌ 1994లో రాజ్యసభ సభ్యురాలు అయ్యారు. ఆ తర్వాత నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజకీయ ప్రవేశానికి ముందు ఆనందీకి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. అయితే పట్టుదల, ధైర్యం, యోగ్యత తదితరాలు ఆమెను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా చేస్తున్నాయి. అభివృద్ధి విషయంలో ఆమెది రాజీపడే తత్వం కాదు. ఆనందీ రైతు కుటుంబం నుంచి వచ్చారు. చదువుకునేందుకు ఆమె ఎన్నో వ్యయప్రయాసలు ఓర్చారు. ఆమె మెహ్సానా జిల్లా బాలికల పాఠశాలలో ఫోర్త్‌ గ్రేడ్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత బాలికల పాఠశాలలో లేకపోవడంతో మరో పాఠశాలలో అడ్మిషన్‌ తీసుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయమేమంటే 700 మంది విద్యార్థులున్న ఆ పాఠశాలలో ఆనందీ ఒక్కరే బాలిక కావడం. ఎనిమిదో తరగతిలో ఆమె విస్నానగర్‌లో గల నూతన్‌ సర్వ్‌ విద్యాలయలో చేరారు. ఆటల్లో ఆమె అత్యున్నత ప్రతిభకు గాను వీరబాల అవార్డును ఇచ్చారు. 1960లో ఆమె భిల్వాయి కళాశాలలో చేరారు. పెళ్లి అనంతరం ఆమె తన మాస్టర్‌ డిగ్రీని, బిఈడిని పూర్తి చేశారు. అంతేకాదు తన కుటుంబ సభ్యులు చదువుకోవాలనే పట్టుదలతో ఆమె ఆ బాధ్యతలు తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *