
పాక్ ప్రధాని నవాబ్ షరీఫ్,
సార్క్ దేశాలకు బీజేపీ ఆహ్వానం
న్యూఢిల్లీ, మే 21 (జనంసాక్షి):
భారత ప్రధానిగా నరేంద్ర మోడీ పట్టాభిషేకానికి హాజరు కావాలని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో పాటు సార్క్ దేశాల నేతలను బీజేపీ ఆహ్వానించింది. ఈ నెల 26న సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్ ఆవరణలో జరిగే కార్యక్రమంలో మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రావాలని బీజేపీ దక్షిణ ఆసియా దేశాధినేతలను ఆహ్వానించినట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి నిర్మలాసీతారామన్ వెల్లడించారు. మోడీ ప్రమాణ స్వీకారానికి
సార్క్ దేశాధినేతలను ఆహ్వానించినట్లు ఆమె చెప్పారు. పటిష్ట విదేశాంగ విధానాన్ని రూపొందించే క్రమంలోనే ఈ ప్రయత్నం అని తెలుస్తోంది. అయితే, మోడీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందినప్పటికీ, నవాజ్ షరీఫ్ రాకపోవచ్చని సమాచారం. ఆయన రాకుండా తన అనుచరులు పంపించనున్నట్లు పాక్ వర్గాలు తెలిపాయి. అయితే, నవాజ్ షరీఫ్‌ను ఆహ్వానించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాక్ ప్రధానిని ఆహ్వానించడాన్ని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. ఇది రెండు దేశాలకు శుభసూచకమని పేర్కొన్నారు. అయితే, పాక్ ప్రధానిని ఆహ్వానించడాన్ని జేడీయూ తప్పుబట్టింది. పాక్‌తో సంబంధాలను ఎన్నికలు ముందు ప్రశ్నించిన మోడీ ఎప్పుడు నవాజ్ షరీఫ్‌ను ఎలా ఆహ్వానిస్తారని జేడీయూ ప్రశ్నించింది.
మా ప్రమాణ స్వీకారణానికి మీరు రండి




