Tuesday, 3 November 2026

సిక్కిం ముఖ్యమంత్రిగా చామ్లింగ్‌ ఐదోసారి ప్రమాణం


నాలుగోసారి పదవి చేపట్టిన బీజేడీ నేత
సిక్కిం, మే 21 (జనంసాక్షి):
సిక్కిం ముఖ్యమంత్రిగా పవాన్‌ చామ్లింగ్‌ బుధవారం ప్ర మాణ స్వీకారం చేశారు. వరుసగా ఐదోసారి ముఖ్యమం త్రిగా బాధ్యతలు చేపట్టి జ్యోతిబసు రికార్డు బద్దలు కొట్టా రు. రాజ్‌భవన్‌లో జరిగిన బుధవారం కార్యక్రమంలో గవర్నర్‌ శ్రీనివాస్‌ పాటిల్‌ పవాన్‌ చామ్లింగ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో
పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చామ్లింగ్‌ నేతృత్వంలోని సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ అసెంబ్లీలో రెండొంతుల మెజార్టీ సాధించింది. మొత్తం 32 స్థానాలకు 22 చోట్ల గెలుపొంది అధికారాన్ని నిలబెట్టుకుంది. మంగళవారం పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన చామ్లింగ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్‌ ఆహ్వానించారు. 1994 డిసెంబర్‌ 12న తొలిసారి అధికారం చేపట్టిన 63 ఏళ్ల చామ్లింగ్‌ రెండు దశాబ్దాలుగా ముఖ్యమంత్రి పీఠంపై కొనసాగుతున్నారు. అంతకుముందు కమ్యూనిస్టు నేత జ్యోతిబసు 1977 నుంచి 2000 వరకు ఏకదాటిగా 23 ఏళ్ల పాటు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రిగా పని చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *