న్యూఢిల్లీ : ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్ సమాయత్తమవుతోంది. ఈ నెల 26న సాయంత్రం ఆరు గంటలకు రాష్ట్రపతి భవన్‌లో విస్తారంగా పరచుకున్న ఫోర్ కోర్టు పచ్చిక బయళ్ళలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి విదేశీ ప్రతినిధులను కలుపుకొని మూడు వేల మందికిపైగా అతిథులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కార్యదర్శి అమితా పాల్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆ క్రమంలో సంబంధిత వేర్వేరు మంత్రిత్వ శాఖలు, ఢిల్లీ పోలీసు, భద్రతా ఏజెన్సీల అధికారులతో అమితా పాల్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్ సభ్య దేశాల ప్రతినిధులు కూడా వస్తున్న కారణంగా అన్ని రకాల ఏర్పాట్లను ఖరారు చేయడం కోసం రాష్ట్రపతి భవన్ అధికారులతో కూడా ప్రణబ్ ముఖర్జీ కార్యదర్శి సమావేశమయ్యారు.
Related