Tuesday, 3 November 2026

మోడీ ప్రమాణానికి చురుగ్గా ఏర్పాట్లు


టీడీపీకి రెండు, వెంకయ్యకు మొండిచేయి
కేబినెట్‌ ఏర్పాటుపై రాజ్‌నాథ్‌తో మోడీ మంతనాలు
కేసీఆర్‌కు ఆహ్వానం
నేడు ఢిల్లీ వెళ్లనున్న గులాబీ బాస్‌
న్యూఢిల్లీ, మే 24 (జనంసాక్షి) :భారత ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమా ణస్వీకారానికి అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. రాష్ట్రపతి భవన్‌ లో భారత ప్రధామంత్రిగా మోడీ 26న ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ ప్రాం తాన్ని గణతంత్ర దినోత్సవ వేడుకలకు చేసిన విధంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సార్క్‌ దేశాధినేతలు రానుండడంతో భద్రతలను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ అంతటా హై అలర్ట్‌ ప్రకటించారు. రైల్వే, విమానాశ్రాయలల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. అడుగడుగునా తనిఖీలు చేపడుతున్నారు. ఇక మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ, సోని యాగాంధీలు కూడా హాజరుకానున్నారు. రాహుల్‌తో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు హాజరుకానున్నట్లు సమాచారం. మరోవైపు భావి ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ సీనియర్‌ నేత ఎం వెంకయ్య నాయుడు శనివారం సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి వర్గంలోకి రాష్ట్రం నుంచి ఎవరెవరిని తీసుకోవాలనే అంశంపై వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం. బీజేపీ తరపు న తెలంగాణ నుంచి దత్తాత్రేయ, ఆంధప్రదేశ్‌ నుంచి ఇద్దరు గెలుపొం దారు. ఎన్డీయే కూటమిలోకి చేరిన టీడీపీకి ఒక కేబినెట్‌, ఒక మంత్రి పద వులు ఇవ్వాలని మోడీ భావిస్తున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. అయితే క ర్ణాటక కోటాలో పార్టీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడికి మంత్రి పదవి ఖా యమని అంతా భావించినా ఆయనను మంత్రివర్గంలో తీసుకునేందుకు మో డీ నో చెప్పినట్లు తెలిసింది. బయటకు పార్టీ పనులు
చూసుకుంటానని వెంకయ్య చెబుతున్నా ఆయన మంత్రివర్గంలో చోటు కోసమే శనివారం మోడీతో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత ప్రధానిగా నరేంద్ర మోడీ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా పలువురు వీఐపీలకు ఆహ్వానం అందింది. దాదాపు మూడువేల మంది విఐపిలు హాజరవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా జూన్‌ రెండో తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్న టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు మోడీ ప్రమాణం స్వీకారానికి రావాల్సిందినగా ఆహ్వానం అందింది. ఆదివారం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్తున్నారు. సోమవారం సాయంత్రం వరకు అక్కడే ఉండి మంగళవారానికి ఆయన హైదరాబాద్‌కు తిరిగివస్తారు.
కేంద్ర మంత్రివర్గ కూర్పుపై భావి ప్రధాని నరేంద్ర మోడీ కసరత్తు ముమ్మరం చేశారు. మంత్రివర్గ ఏర్పాటుపై పలువురు బీజేపీ సీనియర్‌ నేతలతో ఆయన శనివారం చర్చించారు. సోమవారం మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన అంశాలపై బీజేపీ నేతలు దృష్టి సారించారు. ఎన్డీయే కొత్త ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో సీనియర్‌ నేతలు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌, మోడీతో సమావేశమయ్యారు. నేతల రాకతో గుజరాత్‌ భవన్‌, అశోకా రోడ్‌లోని రాజ్‌నాథ్‌ నివాసం సందడిగా మారాయి. సీనియర్‌ నేతలు ఎం.వెంకయ్యనాయుడు, ఉమాభారతి, జేపీ నద్దా, మోడీ సన్నిహితుడైన అమిత్‌ షా తదితరులు న్యూఢిల్లీలోని గుజరాత్‌ భవన్‌లో మోడీతో సమావేశమయ్యారు. మోడీతో భేటీ అనంతరం షా రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశారు. వెంకయ్యనాయుడు మోడీతో సమావేశమయ్యారు. మంత్రివర్గ కూర్పుపై సుమారు గంట సేపు వారిద్దరు చర్చించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితులపై వెంకయ్య కాబోయే ప్రధానికి వివరించారు. అభివృద్ధికి కేంద్రం నుంచి అందించాల్సిన ఆర్థిక సాయంపై చర్చించారు. అనంతరం ఝాన్సీ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించిన ఉమాభారతి, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ రామ్‌దాస్‌ అతావలే మోడీని వేర్వేరుగా కలిశారు. అతావలే కేబినెట్‌లో చోటు ఖాయమైనట్లు సమాచారం. బీజేపీ ఎంపీలు మేనకాగాంధీ, ఉదిత్‌ రాజ్‌, విజయ్‌గోయెల్‌, ఐడీ స్వామి తదితరులు రాజ్‌నాథ్‌ను కలిశారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంలాల్‌ కూడా పార్టీ అధ్యక్షుడ్ని కలిసి చర్చించారు. మోడీ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో సీనియర్లంతా బిజీ బిజీగా ఉన్నారు.
నద్దాకు పార్టీ బాధ్యతలు
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జగత్‌ప్రసాద్‌ నద్దా ఎన్నికయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన శనివారం నరేంద్ర మోడీతోనూ, పార్టీ సీనియర్లతోనూ సమావేశమై చర్చలు జరిపారు. ప్రస్తుత అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను మోడీ క్యాబినెట్‌లోకి తీసుకొని ¬ం శాఖ అప్పగిస్తారని పార్టీ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో నద్దా బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
వారణాసి నుంచి 19మంది అతిథులు
ఈనెల 26న రాష్ట్రపతి భవన్‌లో ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకార చేయనున్న నేపథ్యంలో వారణాసిని నుంచి 19మంది అతిథులను ఆహ్వానించారు. వీరిలో స్వాతంత్య్ర సమరయోధుడు పండిట్‌ మదన్‌మోహన్‌ మాలవ్య మనవడు గిరిధర్‌ మాలవ్య కూడా ఉన్నారు. వారణాసిలో మోడీ నామినేషన్‌ దాఖలు చేసినప్పుడు గిరిధర్‌ మాలవ్య ప్రతిపాదించారు. అంతేకాకుండా మిగిలిన ప్రతిపాదకులు పండిట్‌ చాను లాల్‌ మిశ్రా, వీరభద్ర మాంజి, అశోక్‌ బుంఖర్‌లకు కూడా ఆహ్వానాలు అందాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *