Tuesday, 3 November 2026

నాగాలాండ్‌ సీఎంగా జెలియాంగ్‌ ప్రమాణం


న్యూఢిల్లీ, మే 24(జనంసాక్షి) :
నాగాలాండ్‌ ముఖ్యమంత్రిగా నాగాలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ నేత టీఆర్‌ జెలి యాంగ్‌ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం రాజ్‌భవన్‌లో జరి గిన కార్యక్రమంలో గవర్నర్‌ అశ్వనీకుమార్‌ ఆయనతో ప్రమాణం చేయిం చారు. జెలియాంగ్‌తో పాటు 11 మంత్రులు కూడా బాధ్యతలు స్వీకరిం చారు. ఎన్డీఎఫ్‌ నేతృత్వంలోని డెమోక్రాటిక్‌ అలయెన్స్‌ ఆఫ్‌ నాగాలాండ్‌ గతే డాది మార్చ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా నీఫియో రియో లోక్‌సభకు ఎన్నికైన నేపథ్యంలో రాజీనామా చేశారు. పదకొండేళ్ల పాటు సీఎంగా వ్యవహరించిన ఆయన శుక్రవారం రాజీనామా సమర్పిం చారు. ఆయన స్థానంలో 62 సంవత్సరాల జెలియాంగ్‌ బాధ్యతలు చేప ట్టారు. ఆరుగురికి క్యాబినెట్‌ మంత్రులు, ఐదుగురికి సహాయ మంత్రులుగా ఆయన అవకాశం కల్పించారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహ రించిన ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలికారు. నాగాలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌కు చెందిన నేతలు, ఉన్నతాధికారులు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *