
ఆరుగురు మృతి
సోమాలియా పార్లమెంట్‌పై ఉగ్రపంజా
న్యూయార్క్ మే 24 (జనంసాక్షి) :అమెరికాలోని కాలిఫో ర్నియా శాంతా బార్బారాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫో ర్నియా సమీపంలో అగంతుకులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. శుక్రవారం రాత్రి ఓ గుర్తుతెలియని వ్యక్తి కారు నడుపుకొంటూ స్థానికులపై విచ క్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఆరుగురు అక్క డికక్కడే మరణించారు. ఏడుగురు గాయపడ్డారు. యూని వర్సి టీ చుట్టుపక్కల కారులో తిరిగిన నిందితుడు తొమ్మిది చోట్ల కాల్పులు జరిపాడు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు అతన్ని వెంబడించారు. ఈ సందర్భంగా దుండగుడికి, పోలీసు లకు మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల సమయంలో స్థానికు లను ఇళ్లనుంచి బయటకు రావద్దని పోలీసులు సూచించారు. కారులో నుంచి కాల్పులు జరిపిన వ్యక్తి కూడా మృతి చెంది నట్టు పోలీసులు వెల్లడించారు. అతని తల దగ్గర బుల్లెట్ గా యమైనట్టు తెలిసింది. అయితే పోలీసుల కాల్పుల్లో దుండగు డు హతమయ్యాడా లేక ఆత్మాహుతి
చేసుకున్నాడా అన్నది ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనతో స్థానికుల్లో కలవరం మొదలయ్యింది. చనిపోయినవారి బందువుల రోదనలతో ఆ ప్రాంతం విషాదంగా మారింది. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇదిలావుంటే సోమాలియా పార్లమెంటుపై అల్‌షబబ్ ఉగ్రవాదులు దాడికి దిగారు. రాజధాని నగరమైన మొగదిషు పార్లమెంటు భవనం ముందు ఉగ్రవాదులు కారు బాంబులు పేల్చి దాడులు ప్రారంభించారు. సోమాలియా ప్రభుత్వదళాలు వీరిని అడ్డుకున్నాయి. ఇరు వర్గాల మధ్య జరిగిన పోరులో ఇప్పటికే ఆరుగురు ఉగ్రవాదులు హతమైనట్టుప్రభుత్వదళాలు ప్రకటించాయి. అయితే ఉగ్రవాదులను కట్టడిచేసే క్రమంలో నలుగురు సైనిక సిబ్బంది కూడా చనిపోయినట్టు సమాచారం.
అమెరికాలో అగంతకుల కాల్పులు




