Tuesday, 3 November 2026

నేడు నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం


తెలంగాణ నుంచి దత్తాత్రేయ
ఆంధ్రప్రదేశ్‌ నుంచి హరిబాబు అశోక్‌లకు చోటు
కర్ణాటక నుంచి వెంకయ్యనాయుడు
ఢిల్లీకి చేరిన కేసీఆర్‌
న్యూఢిల్లీ, మే 25 (జనంసాక్షి) :
భారత 15వ ప్రధాన మంత్రిగా భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పక్షనేత నరేంద్రమోడీ సోమవారం సాయం త్రం ఆరు గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం రాజ్‌భవన్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్య క్రమానికి నాలుగు వేల మంది అతిథులు హాజరు కానున్నారు. అటల్‌ బిహారీ వాజపేయి వార సుడిగా బీజేపీ పక్షాన ప్రధాని పీఠం అధిరో హిస్తున్న మోడీ ఆయన వారస త్వాన్ని కొనసా గిస్తున్నారు. సాధారణంగా ప్రధాన మంత్రు లతో పాటు మంత్రులు రాజ్‌ భవన్‌లోని దర్బార్‌ హాల్లో ప్రమా ణ స్వీకారం చేస్తారు. ఈ సంప్ర దాయానికి తెరదించుతూ 199 8లో అటల్‌ బిహారీ వాజపేయి రాజ్‌భవన్‌ ఎదరుగా గల ఓపెన్‌ కోర్టులో ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు మోడీ కూడా ఓపెన్‌ కోర్టులో ప్రమాణ చేయనున్నారు. 1990లో చంద్రశేఖర్‌ కూడా ఓపెన్‌ ఫోర్ట్‌
కోర్టులోనే ప్రమాణ స్వీకారం చేశారు. మోడీతో పాటు 40 మంది మంత్రివర్గ సహచరులు ప్రమాణ స్వీకారం చేస్తారు. వారిలో 16 మందికి మాత్రమే కేబినెట్‌ హోదా దక్కనుంది. యూపీఏ హయాంలో జంబో కేబినెట్‌ కోసం విడదీసిన మంత్రిత్వ శాఖలను మళ్లీ విలీనం చేసే యోచనలో మోడీ ఉన్నారు. పార్లమెంట్‌ సమావేశాల అనంతరం రెండో విడత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మోడీ ఇదివరకే వెళ్లడించారు. అలాగే యూపీఏ మిత్రపక్షాలు ఒక్కో మంత్రి పదవి మాత్రమే ఇస్తానని మోడీ ఖరాఖండిగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నుంచి మొత్తం నాలుగు బెర్తులు ఆశించిన టీడీపీకి నిరాశే ఎదురైంది. ఆదివారం కేబినెట్‌ కూర్పుపై మోడీతో భేటీ అయిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఆ పార్టీకి ఇస్తామన్న ఒక్క కేబినెట్‌ పదవిని సీనియర్‌ నేత, విజయనగరం ఎంపీ అశోక్‌ గజపతిరాజుకు ఇవ్వనున్నారు. ఇక సీమాంధ్ర కోటాలో విశాఖపట్నం ఎంపీ హరిబాబుకు సహాయ మంత్రి పదవి దక్కనుంది. వాజపేయి మంత్రివర్గంలో సహాయ మంత్రిగా పనిచేసేని సికింద్రాబాద్‌ ఎంపీ బండారు దత్తాత్రేయకు మాత్రం ఈసారి కేబినెట్‌ పదవి దక్కనున్నట్లు సమాచారం. ఆయన ఆయనకు స్వతంత్ర హోదా గల సహాయ మంత్రి పదవి ఇచ్చే అవకాశాలున్నాయని కూడా వార్తలు వినవస్తున్నాయి. కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న వెంకయ్యనాయుడిని ఆ రాష్ట్ర కోటాలో కేబినెట్‌లోకి తీసుకోనున్నారు. మొదట వెంకయ్యకు పదవి ఇచ్చేందుకు మోడీ విముఖత వ్యక్తం చేశారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పార్టీ కోసం పనిచేస్తానని వెంకయ్య చెప్పినట్లుగా మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. చివరకు ఆర్‌ఎస్‌ఎస్‌ జోక్యంతో వెంకయ్యను కేబినెట్‌లోకి తీసుకుకోవడానికి మోడీ ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. మరోవైపు తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా పలువురు రాష్ట్ర నేతలను మోడీ ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కె. చంద్రశేఖర్‌రావు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్యతో పాటు ఎంపీలుగా ఎంపికైన వారందరికి మోడీ నుంచి ఆహ్వానాలు అందాయి. అలాగే సార్క్‌ దేశాధినేతలను మోడీ ఆహ్వానించారు. వారికి ఆతిథ్యం ఇచ్చేందుకు ఇప్పటికే హైదరాబాద్‌ను హౌస్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మోడీ ప్రమాణ స్వీకారం చేసే సమయానికి ఢిల్లీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒకవేళ వర్షం కురిస్తే ప్రమాణ స్వీకారాన్ని ఓపెన్‌ ఫోర్ట్‌ కోర్టు నుంచి దర్బార్‌ హాల్‌కు మారుస్తారు. దర్బార్‌ హాల్‌లో 500 మందికి కూర్చునే అవకాశం ఉండగా, మరో నాలుగు వందల మంది వరకు నిల్చుని వీలుంటుంది. మిగతా 3100 మంది అతిథులు ఇతర హాళ్లలో ఎదురు చూడాల్సి వస్తుంది. ఆహ్వానితుల్లో 777 మంది ఎంపీలు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, వివిధ దేశాల దౌత్యవేత్తలు, రాయబారులు, ఇతర రాజ్యాంగ సంస్థల అధినేతలు, 350 మంది పాత్రికేయులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *