హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమితులైన తెరాస అధ్యక్షుడు కెసిఆర్ ఆదివారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సోమవారం దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు కెసిఆర్, పార్టీ ఎంపిలు, సీనియర్ నేతలతో బయలుదేరి వెళ్లారు. ఇటీవలి శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిన తర్వాత కెసిఆర్, ఢిల్లీకి రావడం ఇదే మొదటి సారి. కెసిఆర్, తిరిగి మంగళవారం ఉదయం హైదరాబాద్ తిరిగి వస్తారు.తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వివిధ అంశాలపై తెరాస అధినేత కెసిఆర్, కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమావేశం కానున్నారని సమాచారం. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి రాబట్టే నిధులపై కెసిఆర్ దృష్టి సారించారని తెలిసింది. అదే విధంగా కెసిఆర్, ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోడీతోపాటు బిజెపి సీనియర్ నేతలతోనూ సమావేశం అవుతారు.
Related