Monday, 2 November 2026

ముగిసిన విద్యుత్‌ ఉద్యోగుల సమ్మె

mahanthi
హైదరాబాద్‌, మే 26 (జనంసాక్షి)
రెండు రోజుల పాటు రాష్ట్రాన్ని కు దిపేసిన విద్యుత్‌ ఉద్యోగుల సమ్మె సోమవారం రాత్రి ముగిసింది. పీఆ ర్సీ వర్తింపజేయడంతో పాటు ప్రభు త్వంతో కుదుర్చుకున్న 27.5 శాతం మధ్యంతర భృతి, కాంట్రాక్టు ఉద్యో గుల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమానం వేత నం, కాంట్రాక్టు ఉద్యోగులకు ఐఆర్‌ వర్తిం పజేయడం వంటి డిమాండ్లతో విద్యుత్‌ ఉద్యో గులు ఆదివారం ఉదయం నుంచి సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్‌ సరఫరాలో తీవ్ర అంతరాయం వాటిల్లిం ది. సోమవారం ఉదయం నుంచి ప్రభుత్వంతో ఉద్యోగులు పలు దఫాల్లో నిర్వహించిన చర్చలు ఎట్టకేలకు ఫలవంతమయ్యాయి. పర్మినెంట్‌ ఉ ద్యోగులకు 27.5 శాతం ఐఆర్‌ ఇవ్వడంతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులకు పది శాతం మధ్యంతర భృతి ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. పీఆ ర్సీని రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు అమలు చేస్తాయని ప్రభుత్వం పేర్కొంది. దీంతో సమ్మె విరమిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నాయకులు ప్ర కటించారు. అంతకుముందు విద్యుత్‌ ఉద్యోగులు రెండో రోజు సమ్మె కొనసాగించడంతో దక్షిణాది రాష్ట్రాలకు

కరెంటు గండంఉందని అధికారులు తెలిపారు.మరోవైపు విద్యుత్‌ సౌధ వద్ద విద్యుత్‌ ఉద్యోగుల ఆందోళన నిర్వహించారు. సమారు 6000 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. సమ్మెపై ఉద్యోగులు ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో విద్యుత్‌ ఉత్పాదక సంస్థల్లో ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. దీంతో చేసేదేమిలేక అధికారులు, యాజమాన్యాలు పరిశ్రమలన్నింటికి పవర్‌ కట్‌ అమలు చేశాయి. సమ్మెతో ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్‌ కోతలను ట్రాన్స్‌కో పెంచింది. ఆర్‌టీపీపీ, వీటీపీఎస్‌, కేటీపీఎస్‌లో విద్యుత్‌ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోవడంతో విద్యుత్‌ కొరత ఏర్పడింది. విద్యుత్‌ ఉత్పత్తి 11,000 నుంచి 6000 మెగావాట్లకు ఉత్పత్తి పడిపోయింది. విజయవాడ వీటీపీఎస్‌లో విద్యుత్‌ ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. నాలుగో యూనిట్‌లో 100 మెగావాట్ల విద్యుత్‌ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. 1760 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఫ్లాంట్‌లో యూనిట్లు ట్రిప్‌ అయ్యాయి. దీంతో విద్యుత్‌ ఉత్పత్తి పూర్తిగా పడిపోగా, అదికారులు ప్లాంట్‌ను సేఫ్‌ షట్‌డౌన్‌ చేశారు. పాల్వంచ కేటీపీపీఎస్‌లో 1400 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. మిగిలిన యూనిట్లు కూడా నిలిచిపోతుందని ఉద్యోగులు చెబుతున్నారు. అటు వరంగల్‌ కేటీపీపీలో 300 మెగావాట్లకు పడిపోగా, మధ్యాహ్నానికి విద్యుదుత్పత్తి పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కడప ఆర్టీపీపీలో 5 యూనిట్లలో 1050 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల పరిశ్రమలకు, వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఇదే విధంగా కొనసాగితే ఐదు రాష్ట్రాలు అంధకారంలోకి వెళ్లె అవకాశం ఉంది. తక్షణమే పీఆర్‌సీని అమలు చేయాలంటూ విద్యుత్‌ ఉద్యోగులు ఆదివారం మెరుపుసమ్మెకు దిగారు. తమ డిమాండ్లు నెరవేరేవరకు సమ్మె విరమించేది లేదని భీష్మించారు. దీంతో విద్యుత్‌ ఉత్పాదన, సరఫరాల్లో తీవ్ర అంతరాయాలు తలెత్తాయి. పలు కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. వెంటనే ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు ఉద్యోగ సంఘాల నేతలతో ఆదివారం అర్ధరాత్రి వరకుచర్చలు జరిపారు. అయితే చర్చలు విఫలంకావడంతో సమ్మె కొనసాగించేందుకే ఉద్యోగులు నిర్ణయించారు. అసలే వేసవి కావడం..విద్యుత్‌ వినియోగం పెరిగిపోవడం బొగ్గునిల్వలు తరిగిపోవడం వంటివాటితో సంక్షోభంలో ఉన్న విద్యుత్‌ శాఖ ఉద్యోగుల మెరుపు సమ్మెతో పెను సంక్షోభంలో కూరుకుపోతుందన్న ఆందోళనవ్యక్తమవుతోంది. కాగా ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సోమవారం ఉదయం  కూడా చర్చలు కొనసాగాయి. మరోవైపు పూర్తిస్తాయిలో ప్రభుత్వం లేని సమయంలో ఈ సమ్మె సాగడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. త్వరలో ఏర్పడనున్న ప్రజాప్రభుత్వాలే పీఆర్‌సీ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటాయని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ పట్టుదలతో ఉన్నట్లు తెలిసింది. దీంతో తమ నిరసన కొనసాగించాలని విద్యుత్‌ సంఘాల జేఏసీ నిర్ణయించింది. అయితే పీఆర్‌సీ అమలు చేయలేని పక్షంలో కనీసం మధ్యంతర భృతి(ఐఆర్‌)నైనా ఇవ్వాలని ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతిపాదించింది. దీనిపై ట్రాన్స్‌కో సీఎండీ సురేశ్‌ చందా, జెన్‌కో ఎండీ విజయానంద్‌, ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి తదితరులు అటు సీఎస్‌ మహంతితోను, గవర్నర్‌ నరసింహన్‌తోనూ చర్చలు జరిపారు. వేతనసవరణల్లో భాగంగా ఫిట్‌మెంట్‌ బెనిఫెట్‌ను 27.5 శాతం ఇవ్వాలని నిర్ణయించినందున దానిని ఐఆర్‌ రూపంలో ఇస్తామంటూ ఉద్యోగులకు చెప్పాలని అధికారులకు గవర్నర్‌ సూచించారు. మిగతా అంశాలపై త్వరలో ఏర్పడే ప్రజాప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయన్న విషయం ఉద్యోగులకు చెప్పాలని సూచించారు. గవర్నర్‌ చెప్పిన విషయాన్నే అధికారులు ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులకు తెలియజేశారు. అయితే ఐఆర్‌ను కనీసం 30 శాతం ఇవ్వాలని జేఏసీ ప్రతినిధులు పట్టుబట్టగా అధికారులు అంగీకరించలేదు.  సోమవారం ఉదయం 11 గంటలకు మరోసారి చర్చలకు దిగారు. అయినా ఎలాంటి పురోగతి కనిపించలేదు.  వేతన సవరణ అమలు విషయంలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్న ఎన్టీటీపీఎస్‌ ఉద్యోగులు ఆదివారం మెరుపు సమ్మెకు దిగారు. ఎన్టీటీపీఎస్‌ ఉద్యోగులు విధులు బహిష్కరించి మూడు గేట్ల వద్ద ధర్నాకు దిగారు. ఉదయం ఆరు గంటల మొదటి షిప్టునకు ఉద్యోగులు గైర్హాజరయ్యారు. ఉద్యోగుల మెరుపు సమ్మెతో ఆదివారం విద్యుత్‌ ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ఓఅండ్‌ఎం ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు విధులు బహిష్కరించటంతో ఆరు యూనిట్లలో ఉత్పత్తిని తగ్గించి, రెండో యూనిట్‌లో ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశారు. మరోపక్క బొగ్గు నిల్వలు అడుగంటడంతో ఉత్పత్తి తీవ్ర ప్రభావం పడింది. బొగ్గు నిల్వల కొరత కారణంగా 210 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండో యూనిట్‌ను అధికారులు ఆదివారం ఉదయం షట్‌డౌన్‌ చేశారు.  విద్యుత్‌ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడంతో సీలేరు కాంప్లెక్సులోని సీలేరు, డొంకరాయి, మోతుగూడెం ప్రాజెక్టుల పరిధిలో 400 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఖమ్మం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం ధర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీఎస్‌)లో కార్మికులు ఇంజనీర్లు  మెరుపుసమ్మెకు దిగారు. ఏపీ జెన్‌కోలోని కడప జిల్లా ఆర్టీపీపీ ఉద్యోగులు  మెరుపుసమ్మెలోకి వెళ్లారు. దీంతో ఆర్టీపీపీలోని ఒక యూనిట్‌లో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఈ యూనిట్‌కు బొగ్గు ఫీడింగ్‌ ఇచ్చేందుకు ఉద్యోగ, కార్మిక వర్గాలు లేకపోవడంతో మొదటి యూనిట్‌ను షట్‌డౌన్‌ చేశారు. దీంతో 210 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన యూనిట్‌ ఆగిపోయింది. అలాగే మరో 210 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండవ యూనిట్‌ కూడా మధ్యాహ్నం 3 గంటల వరకు అతి తక్కువ లోడ్‌ఫ్యాక్టర్‌తో నడిచింది. కోల్‌ ఫీడింగ్‌ గంట గంటకు తగ్గుతుండడంతో ఆ యూనిట్‌ను కూడా ఆపివేసే పరిస్థితి నెలకొంది. తమ డిమాండ్‌ నెరవేరేంతవరకు ఉద్యోగులను విధులకు అనుమతించే ప్రశ్నేలేదని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా విద్యుత్‌ ఉద్యోగులు సమ్మెను విరమించుకోవాలని టీడీపీ అధినేత, ఆంధప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విద్యుత్‌ కార్మికులు సమ్మె విరమించాలని తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు విజ్ఞప్తి చేశారు. విద్యుత్‌ ఉద్యోగులకు సంబంధించిన వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) ఒప్పందం అమలు 2014 ఏప్రిల్‌ నుంచే ఉంటుందని సీఎస్‌ పీకే మహంతి చెప్పారు. నిర్ణయం తీసుకోవడంలో కొంత జాప్య జరిగినా ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రతిపాదనలపై విద్యుత్‌ సంఘాల జేఏసీ అంతర్గతంగా సమావేశం నిర్వహించుకుంది.రాష్ట్రపతి పాలన సమయంలో మొండిగా ముందుకు వెళ్లడం మంచిది కాదని, ప్రభుత్వం కేసులు పెడితే వాటిని తొలగించుకోవడానికి రాష్ట్రపతి వరకు వెళ్లి ఇబ్బందులు పడాల్సి వస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. అందువల్ల సమ్మెను విరమించుకుందామని సూచించారు. అయితే ఆ ప్రతిపాదనను కాంట్రాక్టు ఉద్యోగ సంఘాల నేతలు వ్యతిరేకించారు. చివరికి కార్మిక సంఘాల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *