ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 40 మంది మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సంత్ కబీర్‌నగర్‌లో రైలు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి గోరఖ్‌పూర్ వెళ్తున్న గోరఖ్‌ధామ్ ఎక్స్‌ప్రెస్ రైలు మరో గూడ్స్ రైలును ఢీకొంది. దీంతో నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 40 మందికి పైగా మృతి చెందారు. వంది మందికి గాయాలయ్యాయి. ఒకే ట్రాక్‌పై ఉన్న గూడ్సును వందక కిలోమీటర్ల వేగంతో వస్తున్న ఎక్స్‌ప్రెస్ ఢీకొంది. దీంతో పలు బోగీలు పట్టాలు తప్పాయి. సంత్ కబీర్‌నగర్ దగ్గర ప్రయాణిస్తున్న గోరఖ్‌నాథ్ ఎక్స్‌ప్రెస్, అదే ట్రాక్‌లో వస్తున్న గూడ్స్ రైలును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సవిూపంలో ఉన్న ఆస్పత్రికి తరలించగా. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు, అధికారలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టారు. వెంటనే రైల్వే అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేంద్రంలో రైల్వే మంత్రి ఎవరూ లేకపోవడంతో దీనిపై తక్షణం స్పందించే మంత్రి లేకుండా పోయారు. సిగ్నలింగ్ ఇవ్వడంలో తప్పిదం వల్లనే ప్రమాదంజరిగినట్లు తెలుస్తోంది. ఒకే ట్రాక్‌పై గూడ్సు ఉన్న విషయాన్ని అధికారులు గుర్తించలేకపోయారు. ప్రమాదంలో గాయపడిన వారిని వివిధ ఆస్పత్రులల్లో చికిత్సకోసం తరలించారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. దీంతో ఈ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. న్యూఢిల్లీ నుంచి గోరఖ్‌పూర్ వెళ్తున్న గోరఖ్‌ధామ్ ఎక్స్‌ప్రెస్ రైలు సంత్‌కబీర్ నగర్ జిల్లాలో గోరఖ్‌పూర్‌కు 35 కి.మీ.ల దూరంలో ప్రమాదానికి గురయ్యింది. గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఆరు బోగీలు పూర్తిగా పట్టాలు తప్పడంతో ఘోర ప్రమాదం సంభవించింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రైల్వే అధికారులు, ఇతర సిబ్బంది సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. మృతుల కుటుంబాలకు లక్ష చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, స్వల్పగాయాలపాలైన వారికి రూ.10వేల చొప్పున నష్టపరిహారాన్ని అందించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. అలాగే భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ కూడా మృతుల కుటుంబీకులకు సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు.
ప్రమాద ఘటనపై మోడీ దిగ్భ్రాంతి
ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లా చురేబ్ రైల్వే స్టేషన్‌లో జరిగిన గోరఖ్ ధామ్ ఎక్స్‌ప్రెస్ ఘోర రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోడీ సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మోడీ ఆకాంక్షించారు. ప్రమాదంలో గాయపడిన వారికి తగిన సహాయక చర్యలను అందించాలని కేబినెట్ సెక్రెటరీ అజిత్ సేథ్ ను ఆదేశించారు. క్షతగాత్రులకు సత్వర, మెరుగైన వైద్యసాయం అందించే ఏర్పాట్లు చేయవలసిందిగా కేబినెట్ సెక్రెటరీకి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.





