Tuesday, 3 November 2026

మెదక్‌ ఎంపీకి కేసీఆర్‌ రాజీనామా

kcr

న్యూఢిల్లీ, మే 26 (జనంసాక్షి) :

మెదక్‌ లోక్‌సభ స్థానానికి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర్‌రావు రాజీనా మా సమర్పించారు. నరేంద్రమోడీ ప్రమాణ స్వీ కార కార్యక్రమానికి హాజరవ్వడానికి దేశ రాజ ధానికి వచ్చిన కేసీఆర్‌ తన రాజీనామ లేఖను లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ పార్టీ ఎంపీ వినోద్‌ కుమార్‌ ద్వారా పంపించారు. కేసీఆర్‌తో ఫోన్‌ లో మాట్లాడిన లోక్‌సభ కార్యదర్శి రాజీనామా లేఖను స్వీకరించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్‌ మెదక్‌ లోకసభ స్థానంతో పాటు గజ్వేల్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మెదక్‌లో నాలుగు లక్షల మెజార్టీతో కేసీఆర్‌ ఘనవిజయం సాధించారు. గజ్వేల్‌ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ శాసనసభ పక్ష నాయకుడిగా ఎంపిక య్యారు. రాష్ట్ర విభజన తర్వాత జూన్‌ 2 తేదిన తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రమా ణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో గజ్వే ల్‌ శాసన సభ్యుడిగా కొనసాగతూ.. మెదక్‌ లోకస భకు రాజీనామా

చేశారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన ఈ రెండు స్థానాల్లో విజయంసాధించారు. మొత్తానికి ఇప్పుడు మెదక్‌ లోక్‌సభకు ఎన్నిక అనివార్యం కాబోతున్నది. ఇక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది త్వరలో తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *