
రెండు రాష్ట్రాల అభివృద్ధే లక్ష్యం : చంద్రబాబు
హైదరాబాద్, మే 27 (జనంసాక్షి) :
తాను తెలంగాణాకు వ్యతిరేకం కాదని సామాజిక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ అధినేత చంద్ర బాబు తెలిపారు. పునాది నుంచి ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించాలని, తెలంగాణను పునర్నిర్మించాల్సి ఉం దన్నారు. రెండు ప్రాంతాలకు సమన్యాయం జర గాలన్నదే తమ విధానమని ప్రకటించారు. తెలం గాణకు వ్యతిరేకం కాదని, సీమాంధ్రకు న్యాయం జరగాలని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను
అమలు చేస్తామని, రైతులు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని పునరుద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో సీమాంధ్రను స్వర్ణాంధ్రగా మారుస్తామని చెప్పారు. ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేశామన్న బాబు.. కార్యకర్తల శ్రమతోనే అఖండ విజయం సాధించామన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని గండిపేటలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడును చంద్రబాబు ప్రారంభించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగించిన చంద్రబాబు.. పార్టీ శ్రేణులకు భవిష్యత్ మార్గనిర్దేశం చేశారు. రెండు రాష్ట్రాల బాధ్యత తమపై ఉందని, రైతులు, మహిళలు, యువత అందరికీ అండగా నిలబడతామని బాబు ప్రకటించారు. తెలంగాణలో రాజీలేని పోరాటం చేస్తామని చెప్పారు. 2019లో తిరుగులేని మెజార్టీతో గెలిచేలా ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని సూచించారు. భవిష్యత్తులో టీడీపీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. సామాజిక తెలంగాణ కోసం, టీఆర్ఎస్ మేనిఫెస్టో అమలు కోసం పోరాడదామన్నారు. సీమాంధ్రను స్వర్ణాంధ్రగా తయారు చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని పునరుద్ఘాటించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు సాధించే వరకూ పోరాడతామని చెప్పారు. మహిళలకు పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తామని ఇచ్చిన హావిూకి కట్టుబడి ఉన్నానని తెలిపారు. రౌడీయిజాన్ని, ముఠానాయకులను అణచివేస్తామని చెప్పారు. ఎర్రచందనం ముఠా స్మగ్మర్లు స్వామి వారిని కబ్జా చేసేందుకు యత్నించారన్న చంద్రబాబు.. ఆ ముఠాలను నిర్మూలిస్తామన్నారు. యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లు అందజేస్తామని పునరుద్ఘాటించారు. తెలంగాణలో ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యకర్తల త్యాగఫలితంగానే సీమాంధ్రలో అఖండ విజయం సాధించామన్నారు. తెలంగాణలోను కాంగ్రెస్ కంటే మెరుగైన మంచి ఫలితాలు సాధించామని పార్టీ శ్రేణులను అభినందించారు. ‘మనం బలపరిచిన ఎన్డీయేనే కేంద్రంలో అధికారంలో ఉంది. సీమాంధ్రలో సొంతంగా అధికారం చేపడుతున్నామంటే అందుకు కార్యకర్తల శ్రమే కారణం. ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితం’ అని అన్నారు. మహానాడు టీడీపీ పండుగ, తెలుగు జాతి పండుగ అని పేర్కొన్న చంద్రబాబు తెలుగు జాతి కోసం పార్టీ పోరాటం చేస్తుందని చెప్పారు. నాడు తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం, అభివృద్ధి కోసం ఎన్టీఆర్ పార్టీని స్థాపించారని గుర్తు చేసిన చంద్రబాబు.. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి రావడమే కాకుండా సుస్థిర ప్రభుత్వాన్ని అందించారని కొనియాడారు. చాలా మంది అదే నినాదంతో పార్టీలు పెట్టి కనుమరుగై పోయారన్నారు. ప్రజల కోసం పార్టీలు పెట్టాలి తప్పా స్వార్థం కోసం పెడితే ఒరిగేదేవిూ లేదని తెలిపారు. 32 సంవత్సరాల క్రితమే ఎన్టీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించారని, రూ.2 కిలో బియ్యం, పక్కా ఇళ్ల నిర్మాణం వంటి పథకాలతో పాటు పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు వంటివెన్నో ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో సుస్తిర పాలనకు నాంది పలికామన్నారు. చరిత్ర ఉన్నంత వరకు తెలుగు జాతి గుండెల్లో ఉండే నాయకుడు ఎన్టీఆర్ ఒక్కరేనని, ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్దామని సూచించారు.
కాంగ్రెస్ పనైపోయింది..
కాంగ్రెస్ పార్టీపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఎక్కడ ఆచూసిన అవినీతి, దీనికి తోడు అసమర్థత. ఫలితంగా దేశం ప్రతిష్ట పోయింది. రూపాయి విలువ పడిపోయింది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, పెట్రోల్, డీజిల్ ధరలు 30 సార్లు పెరిగాయి.వీళ్ల అవినీతి, అసమర్థత వల్ల అన్ని వ్యవస్తలు కుప్పకూలాయని’ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సంపద కొల్లగొట్టారని.. అవినీతిపరులను ప్రోత్సహించడంతో పాటు అవినీతిలో భాగస్వాములయ్యారని.. దీనివల్ల పదేళ్లు దేశం నిర్వీర్యమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వ విధానాల వల్ల అనేక సమస్యలు వచ్చాయి, ప్రజల్లో కోపం పెరిగింది. ఫలితంగా ఆ పార్టీ 44 సీట్లకు పడిపోయింది. ప్రతిపక్ష ¬దా కూడా కాంగ్రెస్‌కు రాలేదంటే ప్రజల్లో వ్యతిరేకత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు’ అని అన్నారు. ఏకఛత్రాధిపత్యంలో ఉన్న కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ కంటే హీనంగా తయారైంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ మనుగడ సాధించలేదు. సీమాంధ్రలో కేవలం 2 సీట్లకే పరిమితమైందంటే ఆ పార్టీ పరిస్థితి ఊహించుకోవచ్చు. తెలంగాణలోనూ అదే పరిస్థితి, ఇక్కడ వాల్ల కంటే మనమే మెరుగ్గా ఉన్నాం. భవిష్యత్‌లో కాంగ్రెస్ కోలుకోదు’ అని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పాలనలో సహజ వనరులను దోచేశారు. ఆ డబ్బును రాజకీయాల్లో ఖర్చు పెట్టి అధికారంలోకి వచ్చేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేశారని ధ్వజమెత్తారు. కృష్ణా నదిపై రాష్ట్ర హక్కులను కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. బ్రిజేశ్ ట్రిబ్యూనల్ ఎదుట వాదించేందుకు మంచి న్యాయవాదిని పెట్టలేదని మండిపడ్డారు.
పీవీకి స్మారక స్థూపం
దివంగత ప్రధాని పీవీ నరసింహారావును కాంగ్రెస్ అవమానించిందని బాబు మండిపడ్డారు. ‘దేశాన్ని సంస్కరణల బాట పట్టించిన ఆయనకు కాంగ్రెస్ ఏం చేసింది. దేశానికి దిశ, దశ చూపిన పీవీని కాంగ్రెస్ అవమానించింది. ఆయన చనిపోయిన తర్వాత స్మారక కేంద్రం కట్టలేదు. ఎన్డీయే ప్రభుత్వంతో మాట్లాడి ఢిల్లీలోస్మారక కేంద్రం కట్టించేందుకు కృషి చేస్తామని’ ప్రకటించారు. గత పదేళ్లలో అనేక సమస్యలు ఎదుర్కొన్నామని, కాంగ్రెస్ నేతల అహంకారం, దౌర్జన్యం వల్ల చాలా నష్టపోయామన్నారు. అయినప్పటికీ పటిష్టమైన కార్యకర్తల వల్లే పార్టీ మనుగడలో ఉందని కొనియాడారు. 2004 తర్వాత అధికారంలోకి వచ్చిన రాజశేఖరరెడ్డి హయాంలో కక్షగట్టి టీడీపీ కార్యకర్తలను ఎంతో మంది హత్యకు గురయ్యారని తెలిపారు. 200 మంది కార్యకర్తలు హత్యకు గురయ్యారని, ఎమ్మెల్యే పరిటాల రవిని పార్టీ కార్యాలయంలో చంపేశారంటే ఎంత దారుణమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితి బాధాకరమని తెలిపారు. రాష్ట్రపతికి, ప్రధానికి చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తామెప్పుడూ కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదని, ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్యాయుతంగా పోరాడామని గుర్తు చేశారు. గల్ఫ్ సమస్యలపై, బీడీ కార్మికులు, చేనేత కార్మికుల సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేశామన్నారు.
వైఎస్సార్సీపీకి మనుగడ లేదు..
ఇష్టానుసారం వ్యవహరించిన కాంగ్రెస్ వాల్లు అడ్రస్ లేకుండా పోయారని, వైఎస్సార్సీపీ పనైపోయిందని చంద్రబాబు అన్నారు. వైఎస్సార్సీపీ మనుగడ సాధించలేదని, ఉంటామో పోతామో తెలియక ఆ పార్టీకి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. నిన్నటి వరకూ రైతు రుణమాఫీ పథకాన్ని ప్రకటించిన ఆ పార్టీ ఇప్పుడు మాట్లాడడం గమనార్హమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో పాటు ఆ పార్టీ కూడా కనుమరైందని, సీమాంధ్రలోనూ అంతే సంగతి అని అన్నారు.
టీఆర్ఎస్ వార్ రూం ఎందుకో..?
టీఆర్ఎస్పై చంద్రబాబు మండిపడ్డారు. ఎవరైనా ముఖ్యమంత్రి అయిన తర్వాత బాధ్యతాయుతంగా ఉంటారని, కానీ, ప్రతిపక్షంలో ఉన్నరీతిలో వ్యవహరించడం సరికాదన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోగొట్టొద్దు. నగరంలో ఉన్న వారికి రక్షణ కల్పించాలని సూచించారని కోరారు. తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో అందరికీ అండగా ఉంటామన్నారు. వార్ రూం ఎందుకు ప్రారంభించారో తనకైతే అర్థం కావడం లేదని, దీనిపై కేసీఆర్ నుంచి ఎలాంటి సమాధానం లేదని విమర్శించారు. చట్ట ప్రకారం వ్యవహరించాలని సూచించారు. వార్ రూంలు వద్దు, దానివల్ల సాదించేదేవిూ లేదని హితవు పలికారు. ‘కాంగ్రెస్ వార్ రూం పెట్టి ఏమైందో తెలుసుకదా.. అడ్రస్ గల్లంతైంది. టీఆర్ఎస్కు వార్ రూం కాదు కావాల్సింది.. పీస్ రూం కావాలి, డెవలప్మెంట్ రూం కావాలి.. రెండు ప్రాంతాలను సయోధ్యంగా ముందుకు తీసుకెళ్లే రూం కావాలి’ అని అన్నారు. రెండు ప్రాంతాలను అభివృద్ధి చేసే బాధ్యత మనపై ఉందని గుర్తు చేశారు. విభజన సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారం కావాలని, సమన్యాయం కావాలని మొదటినుంచి చెప్పింది ఒక్క టీడీపీయేనని, కానీ, నాయకులు, విూడియా ప్రతినిధులు కూడా ఎగతాళి చేశారని బాబు విమర్శించారు. కానీ, ప్రజలు విజ్ఞత ప్రదర్శించారు. అందుకే మనకు తిరుగులేని మెజార్టీతో గెలిపించారని ప్రశంసించారు.
జాతీయ పార్టీగా టీడీపీ..
టీడీపీ జాతీయ పార్టీగా అవతరించబోతుందని చెప్పారు. ఐదారు రాష్టాల్ల్రో పోటీ చేద్దామన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ జాతీయ పార్టీగా రానుందని తెలిపారు. నిర్దిష్టమైన అజెండాతో ముందుకు వెళ్దామన్నారు. పునాదుల నుంచి ఆంధ్రప్రదేశ్ పని ప్రారంభం కావాల్సి ఉందన్నారు. హేతబద్ధతగా విభజన చేయలేదని విమర్శించారు. అప్పు జనాభా ప్రాతిపదికన, విద్యుత్ వినయోగం ప్రాతిపదికన పంపిణీ చేశారని మండిపడ్డారు. రెండు ప్రాంతాల వారికి అన్యాయం జరగకుండా చూడాలన్నారు. జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి ఉద్యోగుల వివరాలు బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు ఇచ్చిన హక్కులను ముట్టుకోవద్దని, అదే సమయంలో సీమాంధ్రకు న్యాయం చేయాలన్నారు. కేంద్రం ప్రత్యేక నిధులు ఇచ్చి తెలంగాణకు తరహాలో సీమాంధ్రను అభివృద్ధి చేయాలని కోరారు. ‘మాకు మంత్రి పదవులు లేకపోయిన ఫర్వాలేదు.. సీమాంధ్రకు న్యాయం చేయాలని మోడీని కోరాం. అండగా ఉంటానని, ఢిల్లీ కంటే మెరుగైన రాజధాని నిర్మిస్తామని మోడీ గతంలోనే హావిూ ఇచ్చారు. రెండు ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయని, వాటిని అధిగమించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశాన’న్నారు. అవినీతిని పూర్తిగా ప్రక్షాళన చేయాలన్నారు. అవినీతి రహిత భారత్ పార్టీ లక్ష్యమని, దీని కోసం పోరాడదామన్నారు. రాజకీయ, ఆర్థిక, ఎన్నికల సంస్కరణలు తీసుకొస్తే పేదరికమే ఉండదని చెప్పారు. అవినీతిపరులను శిక్షించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని మోడీ ప్రకటించారని గుర్తు చేసిన ఆయన.. అవినీతి వ్యతిరేక శక్తులను నిర్మూలించేందుకు చిత్తశుద్ధితో కృషి చేద్దామని చెప్పారు. అవినీతిని పూర్తిగా ప్రక్షాళన చేయగలిగితే పేదరికమే ఉండదన్నారు. బీసీ సబ్‌ప్లాన్, రాజకీయ రిజర్వేషన్ల కోసం కృషి చేస్తామని తెలిపారు.




