Monday, 2 November 2026

తొందరపడి ఆర్డినెన్స్‌ వద్దు

kcr
పోలవరం ముంపు గ్రామాలను బదలాయిస్తే ఊరుకోం
నీళ్లు తీసుకెళ్లండి.. డిజైన్‌ మార్చండి
వార్‌ రూమ్‌ అంటే యుద్ధ ప్రాతిపదికన పనిచేసేదని అర్థం
బాబుకు ఎందుకు గుబులు? : కేసీఆర్‌
న్యూఢిల్లీ, మే 27 (జనంసాక్షి) :
పోలవరంపై ఆర్డినెన్స్‌ తెచ్చేందుకు నరేంద్ర మోడీ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం య త్నిస్తోందని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకంగా వ్యతిరేకిస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత, కాబో యే ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. కాద ని ముందుకు వెళ్తే న్యాయపోరాటం చేస్తామ ని చెప్పారు. రాష్ట్ర సరిహద్దులను మార్చా లంటే రెండు శాసనసభల్లోనూ చర్చించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని కానీ, ప్రాజెక్టు డిజైన్‌
మార్చాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం కేసీఆర్‌ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. గతంలో పాసైన బిల్లుకు విరుద్ధంగా పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు ఆర్డినెన్స్‌ తయారు చేస్తున్నారని తనకు సమాచారం అందిందని చెప్పారు. అందుకే తాను దీనిపై స్పందించాల్సి వచ్చిందన్నారు. తొలి క్యాబినెట్‌ భేటీలోనే ఆర్డినెన్స్‌ తేవడం దుర్మార్గమని, అంతకంటే నీతిమాలిన చర్య మరొకటి లేదన్నారు. ఒక రాష్ట్ర సరిహద్దులను మరో రాష్ట్రంలో కలపడం అప్రజాస్వామికమని విమర్శించారు. గతంలో రూపొందించిన ఆర్డినెన్స్‌కు క్యాబినెట్‌ అనుమతి లభించలేదని, అందుకే ఈ రోజు (మంగళవారం) తాజాగా ఆర్డినెన్స్‌ రూపొందించి, కేబినెట్‌ భేటీలో ఆమోదించనున్నట్లు సమాచారం అందిందన్నారు. ఇది పద్ధతి కాదని ప్రధానికి అత్యంత సన్నిహితులైన వారికి ఫోన్‌ చేసి చెప్పానని తెలిపారు. తొలి సమావేశంలోనే ఆర్డినెన్స్‌ తేవడం మంచిది కాదని, ప్రజాస్వామ్య స్ఫర్తికి వ్యతిరేకం అనే భావన వచ్చే అవకాశం ఉందని, మోడీ ఇమేజ్‌కు కూడా దెబ్బ తింటుందని చెప్పానన్నారు. పోలవరం ముంపు ప్రాంతాలను విలీనం చేయడంపై ఇంత ఆదరాబాదగా చేయడం సరికాదని, తమ విజ్ఞప్తిని ప్రధాని మన్నిస్తారని భావిస్తున్నామని తెలిపారు. ఇష్టానుసారం ఆర్డినెన్స్‌లు తేవడానికి కుదరదని కేసీఆర్‌ అన్నారు. ఇష్టమొచ్చినట్లు చేయడానికి అది బిల్లు కాదు చట్టం అని అన్నారు. ఆర్డినెన్స్‌ ద్వారా చేసే చట్టం కాదిదని, రాష్టాల్ర పేర్లు, సరిహద్దులు మార్చాలన్నా ఆర్టికల్‌ 3 ప్రకారం చేయాల్సి ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం తొలి క్యాబినెట్‌లోనే ఆర్డినెన్స్‌ తీసుకురావడం మంచిది కాదని ఇది దుష్ట సంప్రదాయం అని వ్యాఖ్యానించారు. మొదటి అడుగులే తప్పటడుగులు కావొద్దని ఆశిస్తున్నామని తెలిపారు. నాలుగు రోజుల్లో పార్లమెంట్‌ సమావేశాలు ఉండగా ఆర్డినెన్స్‌ తేవాల్సిన అవసరం ఏమిటి? అని ప్రశ్నించారు. ఆర్డినెన్స్‌ తెస్తే న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దీనిపై ఇప్పటికే ప్రముఖ న్యాయవాదులతో చర్చించాం, ఇది కోర్టులో నిలవదని వారు చెప్పారన్నారు. ఆర్డినెన్స్‌ తేవడం రాజ్యాంగానికి వ్యతిరేకమని కేసీఆర్‌ తెలిపారు.పోలవరానికి తాము వ్యతిరేకం కాదని కేసీఆర్‌ స్పష్టం చేశారు. అయితే, ప్రాజెక్టు డిజైన్‌ను మార్చాలన్నదే తమ డిమాండ్‌ అని అన్నారు. ఇక్కడ నీళ్ల గురించి పంచాయితీ లేదని, కేవలం డిజైన్‌ మార్పుపైనే వివాదం ఉందన్నారు. భూకంపాలు రావడానికి ఆస్కారమున్న ప్రాంతాల్లో పోలవరం ప్రాజెక్టు ఉన్న ప్రాంతం రెండో స్థానం ఉందని ఆంధ్రకు చెందిన నిపుణులే చెప్పారని, సీమాంధ్ర నీటిపారుదల నిపుణులే ప్రస్తుత డిజైన్‌ను వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు. పోలవరం డిజైన్‌ మార్చాలని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించి, ముంపు తగ్గించి నిర్మిస్తే తాము సహకరిస్తామన్నారు. నీరు సముద్రంలోకి పోకుండా రైతులకు వినియోగంలోకి తెస్తే సంతోషమేనని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును అంగీకరించినట్లు పునర్విభజన చట్టంలో పేర్కొనడంపై కేసీఆర్‌ స్పందించారు. రాష్ట్రం ఉంటేనే కదా అంగీకరించారని ఊహించుకోవడానికి? దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసీఆర్‌ మరోమారు విమర్శలు గుప్పించారు. ఉద్యోగుల విభజనపై ఏర్పాటు చేసిన వార్‌ రూంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రశ్నించగా ఆయన తనదైన శైలిలో స్పందించారు. వార్‌ రూం అంటే యుద్ధ ప్రాతిపదికన పని చేసేదని వివరించారు. బాబుకు ఆలోచన లేకుండా మాట్లాడుతున్నాడని, ఆయన అలా మాట్లాడుతుంటే నేనేం చేస్తానన్నారు. ప్రతీ దాన్ని ఆయన వివాదం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఆయన ప్రస్టేష్రన్‌లో ఉన్నాడని విమర్శించారు. చంద్రబాబు వార్‌ రూం వస్తానంటున్నారని విలేకరులు తెలుపగా వార్‌ రూం వస్తానంటే వద్దంటామా? వస్తే తప్పకుండా స్వాగతిస్తామని తెలిపారు. కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యమే లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాము ఏ కూటమితోనూ లేమని, స్వతంత్రంగా ఉన్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. మాకు రావాల్సిన వాటా మాకు రావాల్సిందే.. లేదంటే పోరాటం తప్పదన్నారు. తాము కూడా ఈ దేశంలో అంతర్భాగమేనని వ్యాఖ్యానించారు. గతంలో ఇద్దరం ఎంపీలమే ఉన్నాం ఇప్పుడు 11 మందిమి ఉన్నాం, పార్లమెంట్‌లో గట్టిగా పోరాడతామని తెలిపారు. పార్లమెంటరీ పార్టీ నేత ఎవరు అనేది పార్లమెంటరీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *