
గొలుసు కట్టు వ్యాపారాల నిషేధం
ఆమ్ వే నిషిద్ధ సంస్థ
చేరే వారు, చేర్పించే వారు దోషులే : కర్నూల్ ఎస్పీ
కర్నూల్, మే 27 (జనంసాక్షి) :
ఆమ్‌వే సీఈఓ విలియం స్కాట్ పింక్నిని కర్నూలు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. చీటింగ్ కేసులో విలి యం స్కాట్‌ను గుర్గావ్‌లో అదు పులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. పింక్నీని న్యాయస్థానం 14 రోజుల రి మాండ్ విధించింది. ఆమ్‌వే సీ ఈఓ విలియం స్కాట్ పింక్నీపై దేశవ్యాప్తంగా పలు కేసులు న్నాయి. మల్టీ, చైన్ మార్కెటింగ్ పేరుతో ఆయన మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. గతంలోనూ అత డ్ని పోలీసులు అరెస్టు చేశారు. అనైతికమైన డబ్బుల పంపిణీని ప్రోత్సహిస్తున్నారంటూ గతేడాది నమోదైన కేసులో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. గొలుసుకట్టు వ్యాపారం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని సంపాదించవచ్చంటూ ప్రజలు, నిరుద్యోగులను మోసం చేస్తోందంటూ ఆమ్‌వే సంస్థపై నమోదు చేసిన కర్నూలు పోలీసులు సంస్థ సీఈవో పింక్నీని అరెస్టు చేశారు. గతేడాది ఆగస్టు నెలలో కర్నూలు నగరానికి చెందిన జగన్నాథరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కర్నూలు ఎస్పీ రఘురామిరెడ్డి తెలిపారు. విలియమ్ స్కాట్‌ను గుర్గావ్‌లో అరెస్టు చేసిన పోలీసులు మంగళవారం ఉదయం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్న ఆమ్‌వే సంస్థపై దేశవ్యాప్తంగా వందల కేసులు నమోదయ్యాయని ఎస్పీ వివరించారు. ఓవైపు కేసులు కొనసాగుతున్నా ఆమ్‌వే సంస్థ నిర్వాహకులు ప్రజలను మభ్యపెడుతూ వ్యాపారాలు చేస్తున్నారని తెలిపారు. ఆమ్‌వే ప్రలోభాలకు లొంగకుండా ప్రజలు, నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆ సంస్థలో సభ్యులుగా చేరి వ్యాపారం చేసిన వారు పోలీసు కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. చట్ట వ్యతిరేక వ్యాపారాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, సీఈఓ అరెస్టును ఆ సంస్థ తీవ్రంగా ఖండించింది. తమ సీనియర్ అధికారిని కస్టడీలోకి తీసుకోవడం దురదృష్టకరమని ఓ ప్రకటనలో పేర్కొంది. దర్యాప్తునకు పింక్నీ అన్ని విధాలుగా సహకరిస్తున్నారని, ఆయన ఎక్కడికి పారిపోవడం లేదని తెలిపింది. వారెంట్ లేకుండా అరెస్టు దురదృష్టకరమని పేర్కొంది.
ఆమ్వేలాంటి సంస్థల్లో చేరి మోసపోవద్దని కర్నూలు ఎస్పీ రఘురామిరెడ్డి ప్రజలను హెచ్చరించారు. గొలుసుకట్టు వ్యాపారం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చంటూ ప్రజలను తప్పుదోవ పట్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇలాంటి వ్యాపారాలపై సమాచారం ఇవ్వాలన్నారు.ఆమ్‌వే ప్రలోభాలకు లొంగకుండా ప్రజలు, నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని, సభ్యులుగా చేరి వ్యాపారం చేసినవారు పోలీసు కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎస్పీ ప్రకటించారు. ఈ జీ మనీవేటలో పడితే అసలుకే మోసం వస్తుందని అన్నారు. నిరోద్యోగులను మోసం చేస్తోందంటూ ఆమ్‌వే సంస్థపై కేసు నమోదు చేసిన కర్నూలు పోలీసులు సంస్థ సీఈవో విలియమ్ స్కాట్ పింక్సెను అరెస్టు చేశారు. గతేడాది ఆగస్టు నెలలో కర్నూలు నగరానికి చెందిన జగన్నాథరెడ్డి ఫిర్యాదుమేరకు కేసునమోదు చేసినట్లు తెలిపారు. విలియమ్‌స్కాట్‌ను గుర్గావ్‌లో అరెస్టు చేసిన కర్నూలు పోలీసులు ఉదయం విూడియా ఎదుట ప్రవేశపెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్న ఆమ్‌వే సంస్థపై దేశవ్యాప్తంగా వందల కేసులు నమోదయ్యాయని ఎస్పీ తెలిపారు. ఓ వైపు కేసులు కొనాసాగుతున్నా ఆమ్‌వే సంస్థ నిర్వాహకులు ప్రజలను మభ్యపెడుతూ వ్యాపారాలు చేస్తున్నారన్నారు.
ఆమ్‌వే సీఈవో అరెస్టు




