పూచీకత్తుకు అంగీకరించిన కేజ్రీవాల్‌

kezree
న్యూఢిల్లీ, మే 27 (జనంసాక్షి) :
నితిన్‌ గడ్కరీ వేసిన పరవునష్టం దావా కేసులో ఆ ప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ బెయిల్‌ బాండ్‌ కట్టడానికి ఎ ట్టకేళకు అంగీకరించారు. బెయిల్‌ బాండ్‌ కట్టడం తన సిద్ధాంతాలకు వ్యతిరేకమంటూ జుడీషి యల్‌ కస్టడీకి వెళ్లిన కేజ్రీవాల్‌ అనంతరం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. మంగళ వారం ఉదయం ఈ పిటిషన్‌ను పరిశీలిం చిన కోర్టు బెయిల్‌ బాండ్‌ కట్టి బయటకు రావాలని కేజ్రీవాల్‌కు సూచించింది. ప్రసు తం తీహార్‌ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను ప్రశాం త్‌ భూషణ్‌, శాంతి భూషణ్‌లు కలిసి ఆయ న అభిప్రాయం తీసుకున్నారు. బెయిల్‌ బాండ్‌ సమర్పించడానికి కేజ్రీవాల్‌ అంగీక రించారు. దీంతో ఆయన తీహార్‌ నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. పరువు నష్టం దావా కేసులో వ్యక్తిగత పూచీకత్తు సమర్పిం చాలన్న ఢిల్లీ హైకోర్టు సూచన మేరకు కేజ్రీవాల్‌ ఈ నిర్ణయం
తీసుకున్నారు. హైకోర్టుకు ఈ మేరకు కేజ్రీవాల్‌ తరపు న్యాయవాదులు రూ.10 వేల పూచీకత్తును సమర్పించారు. ఈ నేపథ్యంలో కేజీవ్రాల్‌ త్వరలోనే జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. బీజేపీ నేత నితిన్‌గడ్కరీ వేసిన పరువు నష్టం దావా కేసులో కేజ్రీవాల్‌ ఢిల్లీ కోర్టులో జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే.