డిజైన్ మార్చాల్సిందే
తెలంగాణాపై బాబు కత్తికట్టిండు
కుట్రలను తిప్పి కొడదాం
టీఆర్ఎస్ నేత హరీశ్
హైదరాబాద్, మే 28 (జనంసాక్షి) :
పోలవరం ముంపు గ్రామాల ఆర్డినెన్స్ సీ మాంధ్ర నాయుళ్ల కుట్ర అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రాజెక్టు డిజైన్ మార్పు కోసం ఎంతవరకైనా పోరాడతా మన్నారు. పోలవరం అంశంపై తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా వ్యవహరి స్తోందని మండిపడ్డారు. చంద్రబాబు తెలం గాణకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. బుధవారం పార్టీ కార్యాల యంలో హరీశ్ విలేకరులతో మాట్లా డారు. తెలంగాణ గిరిజనులను దెబ్బ తీసే విధంగా పోలవరడం నిర్మించడం దారుణమన్నారు. తెలంగాణ గిరిజనులను ముంచేందుకు చంద్ర బాబు పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చెప్పేవి నీతులు తీసేవి గోతులు అని ఎద్దేవా చేశారు. ఇక్కడ నీతులు చెబుతూ, అటు ఢిల్లీకి ఫోన్లో మాట్లా డుతూ పోలవరంపై ఆర్డినెన్స్ తెచ్చేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే ఆరి ్డనెన్స్ తయారైందని తమకు
సమాచారం ఉందన్నారు. వెంకయ్యనాయుడుతో కలిసి ఏడు మండలాలను సీమాంధ్రలో కలపాలని చంద్రబాబు కుట్ర పన్నారని విమర్శించారు. మేం తెలంగాణలోనే ఉంటామని ఆదివాసీలు, గిరిజనులు రోడ్లెక్కి ధర్నాలు చేశారని, ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరించడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరిచి, ఆరు మండలాలను సీమాంధ్రలో కలిపేందుకు యత్నిస్తున్నారన్నారు. పోలవరం అంశంపై తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. హైదరాబాద్ గడ్డపై మహానాడు నిర్వహిస్తూ తెలంగాణపై కుట్ర పన్నుతున్నాడని, దానికి తెలంగాణ నేతలు వంత పాడుతున్నారని విమర్శించారు. పక్కరాష్ట్రమోడు పచ్చిగా గొంతు కోస్తుంటే సోయి లేకుండా ఎట్లా ఉంటారని ప్రశ్నించారు. టీటీడీపీ నేతలకు చీము, రక్తం ఉంటే మీలో పారేది తెలంగాణ రక్తమే అయితే, పోలవరం అంశంపై తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు భజనను మానుకోవాలని హితవు పలికారు. ఇప్పటికే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని, ఇకనైనా తీరు మార్చుకోవాలని సూచించారు.పోలవరం డిజైన్‌ను మార్చకుండా తెలంగాణను ముంచి ప్రాజెక్టు కట్టాలనడం అహంకారం, ఆధిపత్యమేనని హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణపై కక్ష సాధించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘ఆయన కుట్రలను అడ్డుకుంటాం, డిజైన్ మార్పిడి కోసం రాజీ లేని పోరాటం చేస్తాం, కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం’ అని అన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఆరు మండలాలను సీమాంధ్రలో కలపడానికి ఒప్పుకోమని స్పష్టం చేశారు. కేంద్రం మొండిగా ముందుకు వెళ్తే.. ప్రజా పోరాటంతో పాటు న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. తెలంగాణ గిరిజనులను నిరాశ్రయులను చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. పోలవరం విషయంపై తెలంగాణ బీజేపీ నాయకులు కూడా స్పందించాలని హరీశ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల వైపు ఉంటారా? తెలుగుదేశం పార్టీ వైపు ఉంటారా? తేల్చుకోవాలని ఆ పార్టీ నేతలకు సూచించారు. వార్ రూం విషయంలో కూడా చంద్రబాబు అనవసర ప్రేలాపనలు పేలుతున్నారని హరీశ్ ధ్వజమెత్తారు. ఆయన ఎందుకంత కలవరపడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. ప్రపంచంలో చాలా దేశాల్లో వార్ రూంల వ్యవస్థ ఉందని చెప్పారు. అత్యవసర నిర్ణయాలు తీసుకోవడానికి, యుద్ధ ప్రాతిపదికన సమాచార మార్పిడి కోసం వార్ రూం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ‘వార్ రూం అంటే యుద్ధాలు చేస్తారా? చంద్రబాబు.. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే కుదరదు’ అని అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇంకా ఆధిపత్యం చెలాయించేందుకు, తెలంగాణ సంపదను దోచుకొనేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని విమర్శించారు. ఇంకా తెలంగాణ గడ్డ విూద ఉంటానంటే తెలంగాణ ప్రజలు నిన్ను క్షమించరని హెచ్చరించారు. తెలంగాణ గడ్డపై కూర్చొని తెలంగాణ ప్రజల గొంతు కోసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు గొంతు కొస్తుంటే టీ-టీడీపీ నేతలు కట్టుబానిసల్లా అక్కడే పడి ఉంటారా? దాన్ని ఎదుర్కొంటారా? తేల్చుకోవాలన్నారు. జూన్ 2న ఉదయం 8.15 గంటలకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని హరీశ్ వెల్లడించారు. పార్టీ పొలిట్‌బ్యూరో, ముఖ్య నేతలతో చర్చించి మిగతా విషయాలపై రెండు మూడ్రోజుల్లో స్పష్టత ఇస్తామన్నారు. మంత్రి పదవుల కేటాయింపుపై విలేకరులు ప్రశ్నించగా అది ముఖ్యమంత్రిని అడగాలని సూచించారు.





