న్యూఢిల్లీ, మే 28 (జనంసాక్షి) :
కేంద్రంలో కొలువుదీరిన నరేంద్రమోడీ మంత్రి వర్గా నికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం సా యం త్రం విందు ఇచ్చారు. భారత 15వ ప్రధాన మం త్రిగా నరేంద్రమోడీతో పాటు 23 మంది కేబినెట్, పదిమంది స్వతంత్ర, 12 మంది సహాయ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసన విషయం తెలిసిందే. రాష్ట్ర పతి భవన్‌లో కొత్త సర్కారు సారధులకు రాష్ట్రపతి గౌరవంగా విందు ఇచ్చారు. ఈ విందుకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, ఆర్థిక మంత్రి
అరుణ్‌జైట్లీ సహా మోడీ మంత్రివర్గ సహచరులంతా పాల్గొన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందిన యూపీఏ ప్రభుత్వంలోని మంత్రులకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఈనెల 17న విందు ఇచ్చారు. మన్మోహన్‌సింగ్ సహా ఆయన మంత్రివర్గ సహచరులు అప్పటి విందుకు హాజరయ్యారు.





