Monday, 2 November 2026

పాక్‌తో సత్సంబంధాలుకొనసాగుతాయి

sushma

సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గితే ఇరువురికి మంచిది

కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌

న్యూఢిల్లీ, మే 28 (జనంసాక్షి) :

పోరుగుదేశం పాకిస్థాన్‌తో సత్సంబంధాలు కొనసాగుతాయని విదేశాంగ శాఖ మంత్రి సు ష్మాస్వరాజ్‌ తెలిపారు. ప్రపంచంలో బలమైన కూటమిగా సార్క్‌ను నిలబెట్టాలని ఆమె అన్నా రు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా సుష్మా స్వరాజ్‌ బుధవారం బాధ్యతలు స్వీకరిం చారు. తన కార్యాలయానికి చేరుకున్న సుష్మకు విదేశాంగ కార్యదర్శి సుజాతసింగ్‌, ఇతర అధి కారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె విూడియాతో మాట్లాడారు. పాకిస్తాన్‌తో సత్సంబంధాలు ఆశిస్తున్నామని చెప్పారు. ఉద్రి క్తతలు సమసిపోవాలని, రెండు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పాడాలని ఆకాంక్షి స్తున్టన్లు తెలిపారు. సార్క్‌ దేశాలు ప్రపంచ శక్తి గా ఎదగాలన్నదే ప్రధాని నరేంద్ర మోడీ ఆశ యం అని చెప్పారు. దేశంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి

చేస్తామని వెల్లడించారు. అలాగే బుధవారం కేంద్ర మంత్రులుగా ప్రమణ స్వీకారం చేసిన పలువురు బాధ్యతలు స్వీకరించారు. ఎరువులు, రసాయన శాఖ మంత్రిగా అనంతకుమార్‌ బాధ్యతలు చేపట్టారు. తన కార్యాలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు,సిబ్బంది సాదరంగా స్వాగతం పలికారు. కేంద్ర జలవనరులు, గంగా పునరుద్ధరణ మంత్రిగా ఉమాభారతి బాధ్యతలు స్వీకరించారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా మేనకాగాంధీ బాధ్యతలు చేపట్టారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *