Monday, 2 November 2026

8న ప్రమాణం చేస్తా

chandrababunaidu

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి : చంద్రబాబు

హైదరాబాద్‌, మే 28 (జనంసాక్షి) :ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా మే 8న ప్రమాణ స్వీకారం చేస్తానని టీడీపీ అధినేత చంద్రబా బునాయుడు తెలిపారు. మహానాడు వేదికగా తన ప్రమాణ స్వీకార తేదీని బాబు ప్రకటించారు. అంతకుముందు తిరుపతిలో టీడీపీ శాసనసభ పక్ష సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. రెండోరోజు మహానాడు వేది కపై చంద్రబాబు మాట్లాడుతూ చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుం డెల్లో శాశ్వతంగాగుర్తుండే వ్యక్తి ఎన్టీఆర్‌

ఒక్కరేననన్నారు. తెలుగుజాతి సర్వతో ముఖాభివృద్ధికోసం, తెలుగువారి ఆత్మగౌరవం కాపాడేందుకు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. ఎన్టీఆర్‌ పుట్టిన రోజు మహానాడు జరుపుకుంటాం మహానాడు తెలుగు జాతికి పండుగ రోజు అని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చే వరకు కృషి చేస్తామన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని మహానాడులో ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. పేదవారు లేని సమాజం తెలుగుదేశంపార్టీ ఆశయమని ఎన్టీఆర్‌కు అర్పించే నిజమైన నివాళి కూడా అదేనన్నారు. గతంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి ఎన్టీఆర్‌ పేరుపెడితే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆపేరును మార్చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి శంషాబాద్‌ విమానాశ్రయానికి ఎన్టీఆర్‌ అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మారుస్తామని ప్రకటించారు. రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్‌ పేరు పెడితే కాంగ్రెస్‌ మార్చిందని మండిపడ్డారు. పార్టీకి విరాళం ఇచ్చిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ప్రతి కార్యకర్త కూడా పార్టీకి ఎంతోకొంత సాయం చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుకు ‘భారతరత్న’ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ మహానాడులో ఏకగ్రీవ తీర్మానం చేశారు. నల్లధనాన్ని పూర్తిగా దేశానికి తీసుకురావాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. దీంతోనే దేశ ఆర్థిక స్థితి మారిపోయి, పేదరిక నిర్మూలన చేయవచ్చన్నారు. నల్లధనం వెలికితీతకు కేంద్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. వివిధ దేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తీసుకురావాలని కోరారు. ఎన్నికల సంస్కరణలు తీసుకువచ్చి అవినీతిని అంతమొందించడమే ధ్యేయంగా పనిచేస్తామని బాబు తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *