గుజరాత్‌లోని సూరత్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సహారా దర్వాజాలోని 17 అంతస్తుల విపుల్ బిల్డింగ్ నుంచి పెద్దఎత్తున మంటలు ఎగసిప డుతున్నాయి. పై అంతస్తుల్లో మంటలతో దట్టమైన పొ గలు అలముకున్నాయి. ఆగకుండా మంటలు చెలరే గుతూనే ఉన్నాయి. ఈ భవనంలోని పలు అంతస్తు ల్లో వస్త్రాల గిడ్డంగులు ఉన్నట్లు తెలుస్తోంది. 15 అగ్ని మాపక యంత్రాలు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నాయి. ప్రమాదంలో భారీ ఆస్తినష్టం జరిగి నట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరు కు న్నారు. 15 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటల్ని అదు పులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. భారీగా మంటలు ఎగిసిపడుతున్న
కారణంగా అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలకు ఆటంకం కలుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదం 17వ అంతస్తు టెక్స్‌టైల్స్ షోరూంలో సంభవించింది.





