Monday, 2 November 2026

పోలవరం ఆర్డినెన్స్‌ తొందరపాటు : జానా

asaruddin

పార్లమెంట్‌ సమావేశాలుండగా ఆర్డినెన్స్‌ ఎందుకు : అసదుద్దీన్‌

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, మే 29 (జనంసాక్షి) :

మోడీ సర్కారు పోలవరంపై ఆర్డి నెన్స్‌ తీసుకురావడం తొందరపా టు చర్య అని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత కె. జానారెడ్డి అన్నారు. పోల వరం ఆర్డినెన్స్‌ విషయంలో కేం ద్రం ఏకపక్షంగా వ్యవహరించిందంటూ ఆయన మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం చర్యను తప్పుబట్టారు. అలాగే పోలవరం ఆర్డినెన్స్‌ విషయంలో పలు రాజకీయ పార్టీల నాయకులు కేంద్రం తీరును తప్పుబట్టారు. ఇది అప్రజాస్వామికమని స్పష్టం చేశారు. వెంటనే కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలవరం ముంపు మం డలాలను సీమాంధ్రలో కలపాల ని దానిపై ఆర్డినెన్స్‌ తేవడం సరి కాదని ఎంఐఎం అధినేత అసదు ద్దీన్‌ ఒవైసీ అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ.. త్వరలో పార్లమెంటు సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో ఆర్డినెన్స్‌ తేవడంలో ఎన్డీయే తొందరపాటుగా వ్యవహరించిందని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ వ్యవహారంలో కేంద్రం వ్యవహరిస్తున్నతీరుపై సీపీఎం పొలిట్‌బ్యూరో

సభ్యులు సీతారాం ఏచూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డినెన్స్‌ తేవాల్సిన అవసరమేంటని ఆయన ప్రశ్నించారు. రేపో,మాపో పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమవుతాయన్నారు. కేంద్రం దూకుడుగా కాకుండా ఇరుప్రాంతాల సీఎంలతో మాట్లాడాలని ఏచూరి సూచించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు ఆర్డినెన్స్‌ పాలన చేపట్టడం అప్రజస్వామికమని సీపీఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు విమర్శించారు. పోలవరంపై కేంద్ర నిర్ణయంపై ఆయన స్పందించారు. పోలవరం సున్నితమైన సమస్య అని, రెండు రాష్టా ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత చర్చలు జరపాలని సూచించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రెండు రాష్టాల్రకు ప్రయోజనకరం కాదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఆర్డినెన్స్‌ కాకుండా చర్చలు జరిపే విధంగా చూడాలని డిమాండ్‌ చేశారు. దీనిని రెండు ప్రాంతాల ప్రజలు సహేతుకంగా అర్థం చేసుకుని కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే విధంగా వ్యవహరించాలని సూచించారు. ఖమ్మం జిల్లా ప్రజలు పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ముంపు మండలాలను కేంద్రం ఆంధ్రాకు బదలాయించడం సరికాదన్నారు. ఖమ్మం జిల్లా ప్రజల మనోభావాల మేరకే మాట్లాడుతున్నానని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని ముంపు గ్రామాలను ఆంధ్రలోకి బదలాయించగలరా? ఇటీవల ఎన్నికల్లో ఏడు మండలాల నుంచి గెలిచిన నేతలు ఏ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇరు ప్రాంతాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటే వివాదం వచ్చేది కాదన్నారు. ఇదిలావుంటే పోలవరంపై కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ ఇవ్వడం తొందరపాటు చర్య అని మాజీ మంత్రి, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మండిపడ్డారు. హడావిడిగా ఆర్డినెన్స్‌ ఇవ్వడంతో కేంద్రం సీమాంధ్ర ప్రజలవైపే మొగ్గు చూపిస్తుందన్న భావన తెలంగాణ ప్రజలకు కలుగుతుందని అన్నారు. తెలంగాణ, ఆంధ్రలో ప్రభుత్వాలు ఏర్పడ్డాక ఇరువురితో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదో రకంగా తెలంగాణకు వ్యతిరేకంగా తీసుకున్న చర్యగా వారు అభివర్ణించారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ హేతుబద్ధంగా లేదని, దాన్ని వెంటనే మార్చాలని జేఏసీ చైర్మన్‌ కోదండరాం డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజల అభిమతం, ఆదివాసీల ఆకాంక్షను వ్యతిరేకించేలా డిజైన్‌ ఉందని తెలిపారు. రెండు రాష్ట్రాల నేతలు చర్చించి సమస్యను పరిష్కరించాలన్నారు. ఆదిలాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అంతవరకు ముంపు ప్రాంతలను బదలాయించడం సరికాదన్నారు. పోలవరాన్ని తెలంగాణ ప్రజలు కానీ ఇక్కడి నేతలు కానీ వ్‌ంయతిరేకించడం లేదన్నారు. అయితే డిజైన్‌ మారిస్తే ఇరు ప్రాంతాలకు మేలు జరగగలదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *