Monday, 2 November 2026

టీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ నేతగా కేకే

jithendhar
లోక్‌సభలో పార్టీ నాయకుడిగా జితేందర్‌

విప్‌గా కడియం శ్రీహరి

హైదరాబాద్‌, జూన్‌ 3 (జనంసాక్షి):

టీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ నేతగా సీనియర్‌ నాయ కుడు, రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు నియమి తులయ్యారు. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం ఉదయం నిర్ణ యం తీసుకున్నారు. అలాగే లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పక్షనేతగా జితేందర్‌రెడ్డికి అవకాశం కల్పించారు. ఉప నాయకుడిగా బి.వినోద్‌కుమార్‌, లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ విప్‌గా కడియం శ్రీహరిలను ఎంపిక చేశారు. పార్లమెంటరీ నేత, లోక్‌సభాపక్ష నాయకుల ఎంపిక నిర్ణయాన్ని కేసీఆర్‌కు కట్టబెడుతూ ఇటీవల జరిగిన పార్టీ పార్లమెంటరీ, శాసనసభాపక్ష సమావేశం తీర్మానించింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ మంగళవారం ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. వాస్తవానికి లోక్‌సభాపక్ష నాయకుడిగా కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కు అవకాశం లభిస్తుందని అంతా భావించారు. ఆయన కాకపోతే సీనియర్‌ నేత కడియం శ్రీహరికి బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం సాగింది. అయితే, అనూహ్యంగా కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌ ఎంపీ జితేందర్‌రెడ్డికి అవకాశమిచ్చారు. వినోద్‌కు ఉప నేతగా, శ్రీహరికి విప్‌గా బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన గులాబీ దళపతి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో, ఇటు కాంగ్రెస్‌తో సన్నిహిత సంబంధాలు యోచిస్తున్నారు. అందుకే రెండు పార్టీలతో మంచి సంబంధాలు ఉన్న నాయకులకు బాధ్యతలు అప్పగించారు. పార్లమెంట్‌ తొలి సమావేశాలకు హాజరయ్యేందుకు టీఆర్‌ఎస్‌ ఎంపీలు మంగళవారం సాయంత్రం ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. తొలి రెండ్రోజుల సమావేశాల్లో ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *